కాంగ్రెస్‌లోకి తుమ్మల: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ

By narsimha lode  |  First Published Sep 1, 2023, 3:55 PM IST


కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు . టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఇవాళ భేటీ అయ్యారు.



హైదరాబాద్: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  శుక్రవారంనాడు బెంగుళూరులో భేటీ అయ్యారు.  కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు చేరేందుకు  రంగం సిద్దం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

కాంగ్రెస్ పార్టీలో చేరాలని  తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  నేతృత్వంలోని బృందం నిన్ననే కోరింది. ఇవాళ డీకే శివకుమార్ తో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియలో  వైఎస్ షర్మిలకు  కాంగ్రెస్ నేతలకు మధ్య డీకే శివకుమార్  కీలకంగా వ్యవహరించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో సమావేశం ఏర్పాటు చేయించడంలో  డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు.  కర్ణాటక డిప్యూటీ సీఎంగా  డీకే శివకుమార్ ఎన్నికైన తర్వాత వైఎస్ షర్మిల పలుమార్లు ఆయనను కలిసింది.  తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ గురించి డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు  ప్రారంభించింది. ఈ ప్రక్రియ చివరి దశలో ఉంది.

Latest Videos

బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని  ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు తుమ్మల నాగేశ్వరరావు కూడ ఆసక్తితో ఉన్నారని  ప్రచారం సాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడ తుమ్మల నాగేశ్వరరావును  కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుతున్నారు. ఈ తరుణంలో  ఇవాళ డీకే శివకుమార్ తో  తుమ్మల నాగేశ్వరరావు భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారితీసింది.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.  షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరాలతో ఈ విషయం తేలింది. 

also read:పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

పాలేరు నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగాలని తుమ్మల నాగేశ్వరరావు రంగం సిద్దం చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాత్రం తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.  వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేస్తానని  తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరుల సమావేశంలో ప్రకటించారు. గత నాలుగైదు రోజులుగా  జిల్లా నలుమూలల నుండి అనుచరులు తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమౌతున్నారు. పాలేరు నుండి పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ తరపున పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ షర్మిల ఇదే స్థానం కోసం పట్టుబడితే  ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి  తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగే అవకాశాలున్నాయి. 


 

click me!