మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించాలి

Published : Sep 01, 2023, 02:30 PM IST
మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించాలి

సారాంశం

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అందరికీ మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించాలని బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేసింది.

ఇటీవల తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం ఓ బృహత్‌కార్యానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహార పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం సర్వత్రా ప్రసంశనీయంగా మారింది. ఈ తరుణంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు  ఈ అల్పాహార పథక అమలు తీరును సమీక్షిస్తున్నాయి. తమ రాష్ట్రంలో కూడా అమలు చేశాయని భావిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ (1 - 10 తరగతులు) మధ్యాహ్న భోజనముతో పాటు ఉదయం పూట అల్పాహారము కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బాలల హక్కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. గుండు కిష్టయ్య, ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ లు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.  

సమాజంలో వెనుకబడిన వర్గాలవారైన పేద బడుగు బలహీనర్గాలకు చెందిన పిల్లలను నాణ్యమైన విద్యతో  పోషకాహారాన్ని మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసినట్టు గుర్తు చేశారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు కారణంగా పలువురు విద్యార్థులు ఉదయం పూట ఖాళీ కడుపులతోనే పాఠశాలకు వస్తున్నారనీ, ఉదయం ప్రార్ధనా సమయంలో ఎంతోమంది విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోతుంటారని, ఆకలితో అలమటిస్తున్న వారు మధ్యాహ్న సమయంలో పెట్టే భోజనం కోసం ఎదురు చూస్తుంటారని పేర్కొన్నారు.  
    
ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము దేశంలోనే తొలిసారిగా  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ అల్పాహారం ప్రవేశపెట్టిందనీ,  విద్యార్థులు ఉదయం తినకుండా వస్తున్న విషయాన్ని గుర్తించిన స్టాలిన్ ప్రభుత్వం అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. 
     
అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం .. తమిళనాడు ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ (1 - 10 తరగతులు) మధ్యాహ్న భోజనముతో పాటు ఉదయం పూట అల్పాహారము కూడా అందించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తద్వారా దేశంలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించిన మొట్ట మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని సీఎం కేసీఆర్ కు  బాలల హక్కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.  

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్