మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి చెందిన కాలేజీని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. చెరువుకు చెందిన స్థలాన్ని కబ్జా చేసి కాలేజీ కట్టారని పేర్కొంటూ అధికారులు బుల్డోజర్ సాయంతో కాలేజీని కూలగొట్టారు. మరో వైపు ఆయనపై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కాలేజీని నిర్మించారని పేర్కొంటూ ఆ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేవారు. గురువారం ఉదయాన్నే రెవెన్యూ అధికారులు బుల్డోజర్లను తీసుకొని వచ్చి, భారీ పోలీసులు బందోబస్తు మధ్య దుండిగల్ ఎంఎల్ ఆర్ఐటీ కాలేజీని కూల్చివేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం రద్దు
ఈ సమయంలో ఆ కాలేజీలో పని చేసే సిబ్బంది రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కల్పించుకొని, వారిని హెచ్చరించారు. సిబ్బంది వెనక్కి తగ్గడంతో రెవెన్యూ అధికారులు తమ పనిని కొనసాగించారు. ప్రభుత్వ భూమి, చెరువును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేశారని రెవెన్యూ అధికారులు చెప్పారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాలు కూల్చివేత
దుండిగల్ - మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరోనాటికల్ కాలేజీ భవనాలను కూల్చివేస్తున్న అధికారులు.. చిన్న దామర చెరువు కబ్జా చేసి భవనాలు… pic.twitter.com/hKxtOPsmP9
ఇదిలా ఉండగా.. మల్కాజ్‌గిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మర్రి రాజశేఖర్ రెడ్డిపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్ఆర్ఎస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసురిస్తున్న విధానాన్ని నిరసిస్తూ అల్వాల్ మున్సిపాలిటీ ఆపీషు ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం ఉదయం నిరసన చేపట్టారు. ఇందులో మర్రి రాజేశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమయంలో కాస్తా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ ది కీలక పాత్ర - ఐఎంఎఫ్
అల్వాల్ మున్సిపాలిటీ డిప్యూటీ శ్రీనివాస్ రెడ్డితో రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు కొంత వాగ్వాదానికి దిగడంతో పాటు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో డిప్యూటీ కమిషనర్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒకే రోజు ఎమ్మెల్యేకు కాలేజీని కూల్చివేయడంతో పాటు ఆయనపై కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.