సర్దుబాటుకు కోమటిరెడ్డి తూట్లు: నకిరేకల్ సీటుపై తిరుగుబాటు

By narsimha lodeFirst Published Nov 9, 2018, 10:54 AM IST
Highlights

నల్గొండ జిల్లా నకిరేకల్  అసెంబ్లీ నియోజకవర్గం నుండి  కాంగ్రెస్ పార్టీ టికెట్టు  చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే  తాను నల్గొండ నుండి పోటీ చేయనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.


నల్గొండ: నల్గొండ జిల్లా నకిరేకల్  అసెంబ్లీ నియోజకవర్గం నుండి  కాంగ్రెస్ పార్టీ టికెట్టు  చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే  తాను నల్గొండ నుండి పోటీ చేయనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో  94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. మిత్రపక్షాలకు  26 స్థానాలను  కేటాయించనుంది.  సీపీఐకు 3, టీజేఎస్‌కు 8, టీడీపీకి 14, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క సీటును  కేటాయించనుంది.

టీజేఎస్ పోటీ చేసే స్థానాలు ఫైనల్ అయ్యాయి.  కొత్తగా ప్రజా కూటమిలో  చేరిన తెలంగాణ ఇంటి పార్టీకి కూడ  ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించనుంది. తెలంగాణ ఇంటి పార్టీ  నకిరేకల్ స్థానాన్ని కోరే అవకాశం ఉంది.

నకిరేకల్  స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను బరిలోకి దింపాలని భావిస్తోంది. చిరుమర్తి లింగయ్య ప్రచారాన్ని కూడ ప్రారంభించారు.

ఈ తరుణంలో తెలంగాణ ఇంటి పార్టీ నుండి చిరుమర్తి లింగయ్యకు చిక్కు వచ్చిపడింది. దరిమిలా శుక్రవారం నాడు నార్కట్‌పల్లి మండలంలో ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  అడ్డుకొన్నారు.  
 

సంబంధిత వార్తలు

మహాకూటమి ఉన్నా... లేకున్నా గెలుపు మాదే : కేసీఆర్, కేటీఆర్‌లకు కోమటిరెడ్డి సవాల్

 

 

click me!