కొడుకు, కోడలి నుండి ప్రాణహాని:బంజారాహిల్స్ పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు

Published : Aug 06, 2021, 02:17 PM IST
కొడుకు, కోడలి నుండి ప్రాణహాని:బంజారాహిల్స్ పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు

సారాంశం

కొడుకు, కోడలితో ప్రాణహాని ఉందని మాజీ మంత్రి కంతేటీ సత్యనారాయణరాజు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తుల విషయమై తండ్రి ,కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ తరుణంలో ఆయన పోలీసులను ఆశ్రయించారు

హైదరాబాద్: తన కొడుకు, కోడలు నుండి ప్రాణహాని ఉందని మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజుహైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొడుకు, కోడలు ఉంటున్నారు. అక్కడే వ్యాపారం నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా తండ్రీ కొడుకుల మధ్య ఆస్తుల విషయంలో గొడవలు సాగుతున్నాయి.

తన ఆస్తులను తన తదనంతరం కొడుకుకి చెందేలా మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు వీలునామా రాశాడు. అయితే ఈ ఆస్తులు ఇప్పడే కావాలని కొడుకు, కోడలు పట్టుబడుతుండడంతో గొడవ జరుగుతుందని సత్యనారాయణరాజు  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇటీవలనే తన బెడ్‌రూమ్ లో ని తాళాలు పగులగొట్టి ఆస్తుల పత్రాలను తీసుకెఃళ్లారని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని ఉన్నభూమిని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషయమై ఆయన కోర్టును ఆశ్రయించడంతో కొడుకు, కోడలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని  న్యాయస్థానం ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?