తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు

By narsimha lode  |  First Published Jan 17, 2020, 10:41 AM IST

కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన అభ్యర్థులను బరిలోకి దింపారు. కేటీఆర్ పిలిచి మాట్లాడినా కూడ జూపల్లి కృష్ణారావు మాత్రం తగ్గలేదు. 


మహబూబ్‌నగర్: ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలు టీఆర్ఎస్‌లో అగ్గి రాజేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  తన మద్దతుదారులను బరిలోకి దింపారు. పార్టీకి వ్యతిరేకంగా బరిలో ఉన్న అభ్యర్థుల తరపునే జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహంచడం టీఆర్ఎస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది.

Also read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

Latest Videos

undefined

కొల్లాపూర్ మున్సిపాలిటీలో  20  స్థానాల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతుదారులు బరిలోకి దిగారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ నాలుగు రోజుల క్రితం జూపల్లికృష్ణారావును హైద్రాబాద్‌ పిలిపించి మాట్లాడారు. అయితే రెబెల్స్ మాట వింటారా అంటూ జూపల్లి కృష్ణారావు మీడియా ప్రతినిధులకు  ఆరోజే చెప్పారు. ప్రజల్లో బలం ఉన్నవారే విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.

Also read: మున్సిపల్ పోల్స్‌కు కాంగ్రెస్ మేనిఫెస్టో: ఓటర్లకు బంపర్ ఆఫర్స్

కొల్లాపూర్ మున్సిపాలిటీలో  టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా 20 వార్డుల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు బరిలో ఉన్నారు.  2019 డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీకి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు.

Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరారు. హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు తమ అనుచరులను బరిలోకి దింపారు.

కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో మంత్రి కేటీఆర్ ఈనెల 16వ తేదీన చర్చించారు. కానీ జూపల్లి కృష్ణారావు  ఏ మాత్రం తగ్గలేదు. కొల్లాపూర్ మున్సి.పాలిటీలోని 20 వార్డుల్లోని తన మద్దతుదారుల కోసం జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున జూపల్లి కృష్ణారావు వర్గీయులు పోటీ చేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు వర్గీయులు సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంపై పట్టును పెంచుకొనేందుకు హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ప్రయత్నిస్తున్నారు.

గతంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడ హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల మధ్య 60 -40 నిష్పత్తిలో టిక్కెట్ల కేటాయింపు జరిగింది.  కానీ, ఆ ఎన్నికల్లో వీరిద్దరూ పరస్పరం  ప్రత్యర్థివర్గానికి చెందిన అభ్యర్ధులను ఓడించే ప్రయత్నం చేశారు.అయితే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం జూపల్లి కృష్ణారావు వర్గం ఆలిండియా పార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీకి దిగింది.


 

click me!