నేను పార్టీలో ఉన్నానో లేనో బీఆర్ఎస్ నాయకత్వమే చెప్పాలి: మాజీ మంత్రి జూపల్లి సంచలనం

Published : Apr 09, 2023, 09:38 AM ISTUpdated : Apr 09, 2023, 05:25 PM IST
నేను పార్టీలో  ఉన్నానో లేనో బీఆర్ఎస్ నాయకత్వమే చెప్పాలి:  మాజీ మంత్రి జూపల్లి సంచలనం

సారాంశం

బీఆర్ఎస్  నాయకత్వంపై  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  సంచలన వ్యాఖ్యలు  చేశారు.  తాను పార్టీలో  ఉన్నానో  లేనో కూడా బీఆర్ఎస్ నాయకత్వం చెప్పాలని ఆమె  కోరారు. 

హైదరాబాద్: తాను  పార్టీలో  ఉన్నానో  లేనో బీఆర్ఎస్ అధిష్టానం  చెప్పాలని  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  చెప్పారు.  ఇవాళ  హైద్రాబాద్ లో  జూపల్లి కృష్ణారావు ఆదివారంనాడు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  కొత్తగూడెంలో   మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  నిర్వహించే  ఆత్మీయ సమ్మేళనానికి  జూపల్లి కృష్ణారావు  బయలుదేరే ముందు  మీడియా తో మాట్లాడారు.

గత మూడేళ్లుగా  తనకు  పార్టీ సభ్యత్వ పుసక్తాలు  కూడా ఇవ్వలేదని జూపల్లి కృష్ణారావు  చెప్పారు.   కొల్లాపూర్ ఎమ్మెల్యే  హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలను  పార్టీ అధినాయకత్వాన్ని  కూడా ఫిర్యాదు చేసినా  పట్టించుకోలేదని  జూపల్లి  కృష్ణారావు ఆరోపించారు. స్థానిక సంస్థల  ఎన్నికల సమయంలో  పార్టీ నాయకత్వం  తనకు  బీ ఫారాలు  కూడ అందించలేదన్నారు.  కానీ  తన మద్దతుదారులు  ఇండిపెండెంట్ గా  పోటీ చేసి విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు. 

also read:పొంగులేటి ఆత్మీయ సమ్మేళానికి జూపల్లి: ఏం జరుగుతుంది?

ఏ ఉద్దేశ్యంతో  తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో  ఆ దిశగా  రాష్ట్రం సాగుతుందో  లేదా  చూడాల్సిన అవసరం ఉందని ఆయన  అభిప్రాయపడ్డారు. నీళ్లు, నియామాకాలు ,నిధుల  విషయమై  తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్న  విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు  గుర్తు  చేశారు. ఆ దిశగా  పాలన  సాగుతుందా అని  ఆయన  ప్రశ్నించారు.  రాష్ట్రంలో  ఏం జరుగుతుందో  కూడా  ప్రజలకు వివరించాల్సిన  అవసరం కూడా ఉందని  ఆయన  చెప్పారు.  గతంలో  అచ్చంపేటలో  నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి తాను  హాజరైనట్టుగా  జూపల్లి కృష్ణారావు  చెప్పారు.  తన  మిత్రుడు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు  ఇవాళ  కొత్తగూడెం వెళ్తున్నట్టుగా  జూపల్లి కృష్ణారావు  తెలిపారు

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?