పొంగులేటి ఆత్మీయ సమ్మేళానికి జూపల్లి: ఏం జరుగుతుంది?

By narsimha lode  |  First Published Apr 9, 2023, 9:48 AM IST

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  ఖమ్మం  మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  నిర్వహిస్తున్న  ఆత్మీయ సమ్మేళనానికి  బయలుదేరారు.  


హైదరాబాద్;  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  కొత్తగూడెంలో  మాజీ ఎంపీ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  నిర్వహించే  ఆత్మీయ సమ్మేళనానికి   మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  బయలుదేరారు.  ఆదివారంనాడు హైద్రాబాద్ తుక్కుగూడ నుండి  జూపల్లి కృష్ణారావు  అనుచరులతో  కొత్తగూడెం భారీ కాన్వాయ్ తో  వెళ్లారు. కొంత కాలంగా  బీఆర్ఎస్ నాయకత్వంపై  జూపల్లి కృష్ణారావు అసంతృప్తితో  ఉన్నారు. మాజీ మంత్రి కృష్ణారావు  పార్టీ మారుతారనే  ప్రచారం కూడా సాగుతుంది. ఈ తరుణంలో  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  ఆత్మీయ సమ్మేళనానికి  జూపల్లి కృష్ణారావు  వెళ్లడం  ప్రస్తుతం  రాజకీయంగా  ప్రాధాన్యత  సంతరించుకుంది. 

మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు , కొల్లాపూర్ ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గాల  మధ్య  చాలా కాలంగా  పొసగడం లేదు.  2019 లో  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  జూపల్లి కృష్ణారావు పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా హర్షవర్దన్ రెడ్డి  బరిలో నిలిచారు.  జూపల్లి కృష్ణారావుపై  హర్షవర్ధన్ రెడ్డి గెలుపొందారు.  ఆ తర్వాత  చోటు  చేసుకున్న పరిణామాల్లో  హర్షవర్ధన్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో  చేరారు.  దీంతో  ఇరువర్గాల మధ్య  సయోధ్య  కుదరడం లేదు.  ఇరువర్గాల మధ్య  సయోధ్యకు  పార్టీ నాయకత్వం  ప్రయత్నాలు  చేసింది.  మున్సిపల్ ఎన్నికల సమయంలో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  తన  అనుచరులతో  పోటీ చేయించారు.  మండల పరిషత్ ఎన్నికల సమయంలో కూడా  జూపల్లి కృష్ణారావు  పోటీ చేశారు.  ఈ  సమయంలో కూడా  పార్టీ  నాయకత్వం  ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు  ప్రయత్నించింది. 

Latest Videos

also read:నేను పార్టీలో ఉన్నానో లేనో బీఆర్ఎస్ నాయకత్వమే చెప్పాలి: మాజీ మంత్రి జూపల్లి సంచలనం

గత ఏడాది కొల్లపూర్ పర్యటనకు  వెళ్లిన మంత్రి కేటీఆర్  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారాువతో  ప్రత్యేకంగా  సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత  జూపల్లి కృష్ణారావు,  హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య  అంతరం తగ్గిపోతుందని భావించారు.  కానీ  దానికి విరుద్దంగా  జరిగింది.  నియోజకవర్గంలో  అభివృద్దిపై  జూపల్లి కృష్ణారావు,  హర్షవర్ధన్ రెడ్డి మధ్య  సవాళ్లు  చోటు  చేసుకున్నాయి.  ఈ విషయమై  బహిరంగ చర్చ కు  చాలెంజ్ లు  చేసుకున్నారు.  

ఈ సమయంలో  కొల్లాపూర్ లో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది.  పోలీసులు ఇరువర్గాలను  హౌస్ అరెస్ట్  చేశారు.  గత  ఏడాది  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  సమావేశమయ్యారు.  ఈ సమావేశం అప్పట్లో  రాజకీయంగా  ప్రాధాన్యత  సంతరించుకుంది.  ఖమ్మం  జిల్లా  పర్యటనకు  వచ్చినందున  పాత స్నేహితులను  కలుసుకునేందుకు  వచ్చినట్టుగా  జూపల్లి కృష్ణారావు  ప్రకటించారు.ఈ సమావేశంలో  ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  బీఆర్ఎస్ కు దూరంగా  ఉంటున్నారు.  ఈ తరుణంలో  జూపల్లి కృష్ణారావు  కూడా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి  హాజరు కావడం  రాజకీయంగా  ప్రాధాన్యత  సంతరించుకుంది .
 

click me!