ఉద్యోగాల భర్తీ ప్రకటనతో కేసీఆర్ కు యువత నుండి సానుకూలత: జేసీ దివాకర్ రెడ్డి

Published : Mar 09, 2022, 01:20 PM ISTUpdated : Mar 09, 2022, 02:38 PM IST
ఉద్యోగాల భర్తీ ప్రకటనతో కేసీఆర్ కు యువత నుండి సానుకూలత: జేసీ దివాకర్ రెడ్డి

సారాంశం

80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను  భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటన యువత నుండి టీఆర్ఎస్ కు సానుకూలతను తెచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన ఈ విషయమై స్పందించారు.

హైదరాబాద్:  80 వేల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనతో కేసీఆర్ కుయువత నుండి మంచి సానుకూలత  దక్కే అవకాశం ఉందని మాజీ మంత్రి జేసీ దివాకర్  రెడ్డి చెప్పారు.

బుధవారం నాడు హైద్రాబాద్‌లో  మాజీ మంత్రి JC Diwakar Reddy మీడియాతో మాట్లాడారు.  ఇవాళ అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో కొత్తగా 80,039 Government Jobs ను భర్తీ చేస్తామని KCR  ప్రకటించారు.ఈ ప్రకటనపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఉద్యోగ ప్రకటన చేయలేదన్నారు. ఏపీ రాష్ట్రానికి ఒకటి కాదు పది రాజధానులు పెట్టుకోని అది మా సీఎం YS Jagan ఇష్టమన్నారు. మళ్లీ Hyderabad  కు రావాలని Botsa Satyanarayana అనుకొంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.మంత్రి బొత్స ప్రకటన చూస్తే మూడు రాజధానుల అంశాని సీఎం జగన్ వదిలేసినట్టే కన్పిస్తుందన్నారు.మాకు ఇంకా రెండేళ్లు హైద్రాబాద్ లో ఉండే  అవకాశం ఉందన్నారు.ఏపీ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్నారు.

  తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగినట్టుగా చెప్పారు. అయితే అపాయింట్ మెంట్ ఇంకా దొరకలేదన్నారు. సీఎంలను కలవాలంటే గతంలో మాదిరిగా పరిస్థితులు లేవన్నారు.  ఏపీలో మంత్రులకే సీఎం అపాయింట్ మెంట్ లేదని దివాకర్ రెడ్డి విమర్శించారు.

త్వరలోనే  రాష్ట్రంలోని 80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి  ఇప్పటి వరకు 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సీఎం KCR  బుధవారం నాడు Telangana Assembly  వేదికగా కీలక ప్రకటన చేశారు.  

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 91,147 ఉన్నాయని సీఎం చెప్పారు. అయితే ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించగా మిగిలిన 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, వైద్య, ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యా శాఖలో 7,878, రెవిన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో 4,311, గిరిజన సంక్షేమ శాఖలో 2,399, సాగునీటి శాఖలో 2,692  పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుండే ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్  జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

మైనారిటీ శాఖలో 1,825,అటవీశాఖలో 1598,పంచాయితీరాజ్ శాఖలో 1455,కార్మిక శాఖలో 1221,ఫైనాన్స్ శాఖలో 1146, మున్సిఫల్ శాఖలో 859, వ్యవసాయ శాఖలో 801, రవాణ శాఖలో 563 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు.న్యాయ శాఖలో 386,సాధారణ పరిపాలన శాఖలో 343,పరిశ్రమల శాఖలో 233, పర్యాటక శాఖలో 184, సచివాలయం, హెచ్ఓడీ, వర్శిటీల్లో 8,147 ఖాళీలున్నాయని సీఎం వివరించారు.

ఇక గ్రూప్- 1లో 503,గ్రూపు 2లో 582, గ్రూప్ 3లో1373, గ్రూప్ 4 లో9168, జిల్లా స్ధాయి లో 39,829,జోనల్ స్థాయిలో 18866,మల్టీజోన్ లో13170, అదర్ కేటగిరిలో వర్సిటీలలో 8174 భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

ఇక జిల్లాల వారీగా ఈ కింది విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 
హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా