రాహుల్ ఫోన్ ఎఫెక్ట్: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జానా

By narsimha lodeFirst Published Mar 20, 2019, 2:42 PM IST
Highlights

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు.

బుధవారం నాడు సీఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి  జానారెడ్డి మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో ప్రతిపిక్షాలను లేకుండా చేస్తే.... ప్రభుత్వాన్నే లేకుండా చేసే పరిస్థితి తమ చేతుల్లో ఉంటుందని టీఆర్ఎస్ నేతలకు ప్రజలకు చెప్పాల్సి ఉంటుందన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు తాము సహకరిస్తామని చెప్పామన్నారు. కానీ,టీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం నాడు జానారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని  బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆ తర్వాత జానారెడ్డి ఈ ప్రెస్ మీట్ ‌లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రేణుకా చౌదరి , పొంగులేటిలకు బీజేపీ గాలం

రాహుల్ ఫోన్ ఎఫెక్ట్: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జానా

బలమైన నేతలను బలహీనపర్చారు: కాంగ్రెస్‌పై డీకే అరుణ
'ఉత్త'ర కుమారుడే: రెక్కలు తెగిన పక్షిలా కాంగ్రెస్ విలవిల

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ: కేసీఆర్‌తో భేటీ, కారెక్కనున్న మరో ఎమ్మెల్యే


 

click me!