బలమైన నేతలను బలహీనపర్చారు: కాంగ్రెస్‌పై డీకే అరుణ

Published : Mar 20, 2019, 12:48 PM ISTUpdated : Mar 20, 2019, 05:49 PM IST
బలమైన నేతలను బలహీనపర్చారు: కాంగ్రెస్‌పై డీకే అరుణ

సారాంశం

రాష్ట్ర నాయకత్వం అసమర్ధత కారణంగానే తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దెబ్బతింటుందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

మహబూబ్ నగర్: రాష్ట్ర నాయకత్వం అసమర్ధత కారణంగానే తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దెబ్బతింటుందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

బీజేపీలో చేరిన మాజీ మమంత్రి డీకే అరుణ బుధవారం నాడు న్యూఢిల్లీలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిని కేంద్రీకరించలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను బలహీనపర్చేందుకు రాష్ట్ర నాయకత్వం పకడ్బందీగా వ్యవహరించిందని ఆమె ఆరోపించారు.ఈ విషయాలను ఐఎసీసీ పెద్దల దృష్టికి తెచ్చినా కూడ సీరియస్‌గా పట్టించుకోలేదన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే కాంగ్రెస్ పార్టీని ఒక్క స్థానంలో కూడ గెలవకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానిదేనని ఆమె ఆరోపించారు.  

2014 ఎన్నికల్లో ఓ ఎంపీ, ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించామన్నారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్సీని కూడ గెలిపించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకొన్నారు.

సంబంధిత వార్తలు

రేణుకా చౌదరి , పొంగులేటిలకు బీజేపీ గాలం

రాహుల్ ఫోన్ ఎఫెక్ట్: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జానా

బలమైన నేతలను బలహీనపర్చారు: కాంగ్రెస్‌పై డీకే అరుణ
'ఉత్త'ర కుమారుడే: రెక్కలు తెగిన పక్షిలా కాంగ్రెస్ విలవిల

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ: కేసీఆర్‌తో భేటీ, కారెక్కనున్న మరో ఎమ్మెల్యే

 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే