ఒక్క ఎకరం ఆక్రమించినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా: కన్నీళ్లు పెట్టుకొన్న ఈటల భార్య జమున

By narsimha lodeFirst Published May 30, 2021, 9:55 AM IST
Highlights

తాము ఎలాంటి తప్పు చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున చెప్పారు.ఆదివారం నాడు ఆమె హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  ఆమె కన్నీళ్లు పెట్టుకొన్నారు.మాసాయిపేటలో మోడ్రన్ హేచరీస్  పెట్టాలని 46 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని ఆమె చెప్పారు. 

హైదరాబాద్: తాము ఎలాంటి తప్పు చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున చెప్పారు.ఆదివారం నాడు ఆమె హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  ఆమె కన్నీళ్లు పెట్టుకొన్నారు.మాసాయిపేటలో మోడ్రన్ హేచరీస్  పెట్టాలని 46 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని ఆమె చెప్పారు. మహిళా సాధికారిత గురించి చెప్పుకొనే తెలంగాణ ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. ఒక మహిళగా తాను హేచరీస్ నడుపుతూ వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కానీ అలాంటి తనకు ఎలాటి సహాయ సహకారాలు అందించకపోగా తమపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

also read:టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈటల అనుకూల నినాదాలు, ఉద్రిక్తత

బడుగు, బలహీనవర్గాలకు చెందిన 100 ఎకరాల భూమిని ఆక్రమించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆమె కన్నీళ్లు పెట్టుకొన్నారు.  ఈ విషయమై ఆమె అధికారులకు సవాల్ విసిరారు. తాను ఇతరులకు చెందిన భూమిని ఒక్క ఎకరం ఆక్రమించుకొన్నట్టుగా నిరూపించినా ముక్కు నేలకు రాస్తా... తప్పడు నివేదికలు ఇచ్చినట్టుగా రుజువైతే అదికారులు ముక్కు నేలకు రాస్తారా అని ఆమె ప్రశ్నించారు. 

1994లో దేవరయంజాల్ గ్రామంలో తాము భూములు కొనుగోలు చేసి ఆ భూముల్లో గోడౌన్లు నిర్మాణాలు చేపట్టామన్నారు. ఈ గోడౌన్లను ఖాళీ చేయించాలని ఈ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఆస్తులను అమ్ముకొని ఉద్యమం సాగించలేదా అని ఆమె గుర్తు చేశారు.దేవరయంజాల్ గ్రామంలోని తమ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి తీసుకొచ్చిన రుణం ద్వారానే నమస్తే తెలంగాణ పత్రిక భవనం నిర్మించలేదా అని ఆమె ప్రశ్నించారు. ఆ సమయంలో ఈ భూమి ఆక్రమించుకొన్నామని ఎందుకు చెప్పలేదన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  బ్రేవరేజేస్ కార్పోరేషన్ కు గోడౌన్ నిర్మాణం కోసం అన్ని  రకాల నిబంధనల మేరకు గోడౌన్ నిర్మించామని చెప్పారు. ఇప్పటికీ కూడ ఆ గోడౌన్ ను బ్రేవరేజేస్ కార్పోరేషన్ వినియోగిస్తోందన్నారు. అయితే ఈ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఈ గోడౌన్ ను ఖాళీ చేయించారని జమున ఆరోపించారు.


 

click me!