మైనర్ బాలుడితో 20ఏళ్ల యువతి సహజీవనం... ఉరేసుకుని బాలుడు మృతి

Arun Kumar P   | Asianet News
Published : May 30, 2021, 08:34 AM ISTUpdated : May 30, 2021, 08:44 AM IST
మైనర్ బాలుడితో 20ఏళ్ల యువతి సహజీవనం... ఉరేసుకుని బాలుడు మృతి

సారాంశం

మైనర్ బాలుడితో 20ఏళ్ళ యువతి సహజీవనం నెలరోజులు కూడా గడవకుండానే మనస్పర్ధలు పెరిగి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.     

హైదరాబాద్: ఆమెకు 20 ఏళ్లు. ఇంటర్మీడియట్ చదివే ఓ మైనర్ బాలుడిని ప్రేమించింది. వీరిద్దరు పెద్దలను ఎదిరించి మరీ హద్దులుదాటి సహజీవనం చేశారు. అయితే నెలరోజులు కూడా గడవకుండానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ లోని యూసఫ్ గూడ ప్రాంతంలో ఓ పోలీస్ శాఖ ఉద్యోగి కుటుంబంతో కలిసి నివాసం వుంటున్నాడు. అతడికి ఇంటర్మీడియట్ చదివే ఓ కొడుకు వున్నాడు. అయితే 17ఏళ్ల ఈ మైనర్ బాలుడు అదే ప్రాంతంలో నివాసముండే ఓ 20ఏళ్ళ యువతితో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమ విషయం తెలిసి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించపోవడంతో ఇంటినుండి పారిపోయారు. జవహర్ నగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేయడం ప్రారంభించారు. 

read more ఉరేసుకుంటూ వీడియో... భార్య కోసం ప్రాణాలమీదకు తెచ్చుకున్న భర్త

ఈ క్రమంలో నెలరోజులు కూడా గడవకుండానే ఈ ప్రేమజంట మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవికాస్తా ఇటీవల తారాస్థాయికి చేరడంతో ఇక కలిసి బ్రతకడం కుదరదని భావించి కలిసి చద్దామని నిర్ణయించుకున్నారు. శనివారం ఇద్దరు గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకోగా బాలుడు చనిపోయాడు. ఉరేసుకున్న చున్నీ ఊడిపోవడంతో యువతి ప్రాణాలతో భయటపడింది.  

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం