సీఎం కావాలని అనుకోలేదు, ఇంత కుట్రను చూడలేదు: ఈటల

By narsimha lode  |  First Published May 4, 2021, 3:36 PM IST

దేశచరిత్రలో ఇంత కుట్రపూరితంగా ఎవరూ వ్యవహరించలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.మంగళవారం నాడు  హుజూరాబాద్‌లో ఆయన  మీడియాతో మాట్లాడారు. తనపై మంత్రులు కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్ లు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. 



హైదరాబాద్: దేశచరిత్రలో ఇంత కుట్రపూరితంగా ఎవరూ వ్యవహరించలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.మంగళవారం నాడు  హుజూరాబాద్‌లో ఆయన  మీడియాతో మాట్లాడారు. తనపై మంత్రులు కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్ లు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. ప్రగతిభవన్ లో సీఎంను కలిసే అవకాశం మంత్రులకు కూడ లేదన్నారు. ఆరోగ్యం బాగాలేదని తెలిసి కేసీఆర్ ను కలిసేందుకు మంత్రులు వెళ్తే  కలిసేందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. సీఎంకు ఇంత అహంకారమా అని గంగుల కమలాకర్ తనతో వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

also read:ఈటలను దోషిగా చూపేందుకే అసైన్డ్ భూముల విచారణ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Latest Videos

undefined

ఐఎఎస్ అధికారులు దారుణంగా విచారణ నిర్వహించారని  మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. నోటీసులు కూడ ఇవ్వకుండా ఎలా విచారణ చేస్తారని ఆయన ప్రశ్నించారు.  వ్యక్తులు ఉంటారు... పోతారు.. ధర్మం ఎక్కడికీ పోదన్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తానని ఆయన చెప్పారు. తనకు వ్యతిరేకంగా మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. మంత్రుల వ్యాఖ్యలు వారి విజ్ఘతకే వదిలేస్తున్నానని ఆయన తెలిపారు.  

నేను ముఖ్యమంత్రిని కావాలని అనుకోలేదన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం కావాలి అన్నానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేరే పార్టీల వాళ్లతో మాట్లాడడమే నేను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఇక నుండి  అన్ని పార్టీల నేతలతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.


 

click me!