ఈటెలపై వేటుకు రంగం సిద్ధం: కేసీఆర్ కు కరీంనగర్ జిల్లా నేతల లేఖ

Published : May 04, 2021, 02:05 PM ISTUpdated : May 04, 2021, 02:17 PM IST
ఈటెలపై వేటుకు రంగం సిద్ధం:  కేసీఆర్ కు కరీంనగర్ జిల్లా నేతల లేఖ

సారాంశం

ఈటల రాజేందర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేశారు.  ఈ తీర్మానం కాపీని టీఆర్ఎస్ అధిష్టానానికి పంపారు 

ఈటల రాజేందర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేశారు.  ఈ తీర్మానం కాపీని టీఆర్ఎస్ అధిష్టానానికి పంపారు ఈ తీర్మానం కాపీపై  మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల విద్యాసాగర్ రావు , ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వినోద్ లు  సంతకం చేశారు. ఈటలపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఆ తీర్మానంలో కోరారు. దీంతో ఈటెల రాజేందర్ మీద వేటుకు రంగం సిద్ధమైనట్లు అర్థమవుతోంది. పార్టీ నుంచి ఆయన పంపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

also read:అంతా ప్లాన్ ప్రకారంగానే జరిగింది: హైకోర్టులో ఈటల న్యాయవాది

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ  ఈటల రాజేందర్ వ్యవహరించారని   టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్  జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈటలను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయమై  సీఎం కేసీఆర్ కు తీర్మానం కాపీని పంపారు. 

 

మంత్రివర్గం నుండి తప్పించిన తర్వాత  ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలను కూడ ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించారు. ఈ లేఖ ఆధారంగా ఈటల రాజేందర్ పై పార్టీ వేటు వేసే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించలేదు. 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్