తెలంగాణ సరిహద్దులోనే అంబులెన్స్‌ల నిలిపివేత: కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

By narsimha lodeFirst Published May 14, 2021, 11:18 AM IST
Highlights

సరిహద్దుల్లో ఏపీకి చెందిన అంబులెన్స్‌లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ను మాజీ ఐఆర్ఎస్ అధికారి  జి. వెంకటకృష్ణారావు శుక్రవారం నాడు దాఖలు చేశారు. 

హైదరాబాద్: సరిహద్దుల్లో ఏపీకి చెందిన అంబులెన్స్‌లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ను మాజీ ఐఆర్ఎస్ అధికారి  జి. వెంకటకృష్ణారావు శుక్రవారం నాడు దాఖలు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వైద్యం కోసం తెలంగాణలోకి వచ్చేవారికి ప్రత్యేక గైడ్‌లైన్స్ ను విడుదల చేసింది కేసీఆర్ సర్కార్.  తెలంగాణ రాష్ట్ర ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని  తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా  శుక్రవారం నాడు  తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో  భారీగా అంబులెన్స్ లను ఇతర వాహనాలను  నిలిపివేశారు. 

also read:సరిహద్దుల్లో కఠినంగా ఆంక్షలు: అనుమతి ఉంటెనే తెలంగాణలోకి ఎంట్రీ

ఈ విషయమై  మాజీ ఐఆర్ఎస్ అధికారి వెంకట కృష్ణారావు శుక్రవారం నాడు  తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది. సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపివేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి మూడు  రోజుల క్రితం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

click me!