తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలవరం.. ఒకరి మృతి.. మరో ముగ్గురిలో..

By telugu news team  |  First Published May 14, 2021, 8:39 AM IST

మరికొందరు ఈ లక్షణాలతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు గుర్తించారు. నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ తో చికిత్స పొందుతున్న నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం.
 


కరోనా మహమ్మారి ప్రజలను ఎంతలా భయపెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానినే ఎదుర్కోలేకపోతున్నామని అందరూ భయపడుతున్న వేళ.. మరో మహమ్మారి మరింత కలవరపెడుతోంది. తెలంగాణలోనూ మ్యుకర్ మైకోసిస్( బ్లాక్ ఫంగస్) లక్షణాలు బయటపడుతున్నాయి.

తాజాగా ఈ బ్లాక్ ఫంగస్ తో తెలంగాణలో  ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు కరోనా రోగుల్లోనూ దీనిని గుర్తించారు. మరికొందరు ఈ లక్షణాలతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు గుర్తించారు. నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ తో చికిత్స పొందుతున్న నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం.

Latest Videos

undefined

సంబంధిత వైద్య వర్గాలు మాత్రం దీనిని నిర్థారించడం లేదు. ఇటీవల ప్రైవేటు ఆస్పత్రిలో సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్న ముగ్గురు గాంధీలో చేరారు. వారిలో ఈ ఫంగస్ లక్షణాలు గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

సాధారణంగా కరోనా రోగుల్లో వ్యాధి నిరోదక శక్తి తగ్గుతుంది. దీనికి తోడు ఆక్సీజన్ స్థాయి తగ్గిన వారికి స్టెరాయిడ్స్ అందిస్తుంటారు. అవి వ్యాధి నిరోధక శక్తి పై కొంత ప్రభావం చూపిస్తాయి. దానికి మధుమేహం తోడైతే.. బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ విషయంలో ప్రజలు భయాందోళనపడాల్సిన అవసరం లేదని.. ఇది అందరికీ సోకదని గాంధీ సీనియర్ వైద్యులు చెబుతున్నారు. తొలి దశలో కూడా గాంధీలో చికిత్స పొందిన 10 మంది కరోనా రోగుల్లో దీనిని గుర్తించామని ఆయన చెప్పారు. ఒకరిద్దరు తప్ప... అందరూ చికిత్స తో కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

కరోనా రోగులందరికీ ఇది రాదని భరోసా ఇస్తున్నారు. కరోనా వచ్చినవారందరికీ బ్లాక్ ఫంగస్ రాదని వైద్యులు చెబుతున్నారు. 

click me!