ప్రణబ్ ముఖర్జీ మృతి: భావోద్వేగానికి గురైన మాజీ గవర్నర్ రోశయ్య

Published : Aug 31, 2020, 08:43 PM IST
ప్రణబ్ ముఖర్జీ మృతి: భావోద్వేగానికి గురైన మాజీ గవర్నర్ రోశయ్య

సారాంశం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య భావోద్వేగానికి గురయ్యారు.

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య భావోద్వేగానికి గురయ్యారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం తెలుపుతూ మాజీ గవర్నర్ రోశయ్య భావోద్వేగానికి గురయ్యారు. 

తాను గవర్నర్ గా ఉన్న సమయంలో చెన్నై రాజ్ భవన్ లో ఆయనను కలుసుకొన్నట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. మరో వైపు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో హైద్రాబాద్ రాష్ట్రపతి భవన్ లో ఆయనను చివరిసారిగా తాను కలుసుకొన్న విషయాన్ని ఆయన చెప్పారు.

also read:ప్రణబ్ ముఖర్జీ మృతి: ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

ఈ సమయంలోనే రోశయ్య కళ్లు చెమర్చాయి. కన్నీళ్లను అదిమిపెట్టుకొని ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం తెలిపారు.ఈ నెల 10వ తేదీన అనారోగ్య సమస్యలో ప్రణబ్ ముఖర్జీ ఆర్మీ ఆసుపత్రిలో చేరాడు. ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించాడు. ప్రణబ్ మృతికి సంతాపం తెలుపుతూ ఏడు రోజుల పాటు కేంద్రం సంతాప దినాలను ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?