కేటీఆర్ పీఏ అంటూ మోసం: మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్

Published : Nov 16, 2020, 09:24 PM IST
కేటీఆర్ పీఏ అంటూ మోసం: మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్

సారాంశం

తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏను అంటూ డబ్బులు వసూలు చేసిన మాజీ రంజి క్రికెటర్  నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏను అంటూ డబ్బులు వసూలు చేసిన మాజీ రంజి క్రికెటర్  నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

నాగరాజుపై గతంలో కూడ పలు కేసులు నమోదైనట్టుగా పోలీసులు తెలిపారు. డ్రగ్స్, ఫార్మా కంపెనీల వద్ద నుండి డబ్బులు వసూలు చేసినట్టుగా ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు.

ఫార్మా కంపెనీల నుండి డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. పొల్యూషన్ బోర్డు నోటీసులు ఇవ్వకుండా చూస్తానని రూ. 15 లక్షలు స్వాహా చేసినట్టుగా ఇదివరకే కేసు నమోదైంది.  పొల్యూషన్ బోర్డు నోటీసులు ఇవ్వకుండా చూస్తానని చెప్పి ఈ డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

నాగరాజుపై గతంలో ఏపీ, తెలంగాణలో పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా మంత్రి కేటీఆర్ పేరు చెప్పి నాగరాజు మోసాలకు పాల్పడినట్టుగా ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి పలువురిని మోసం చేసిన ఘటనలు అనేకం నమోదైన విషయం తెలిసిందే.తాజాగా జరిగిన కేసులో మాజీ

 

PREV
click me!

Recommended Stories

Telangana Weatherman : ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు, ఎక్కడ, ఎంత వర్షం పడుతుందో ముందే ఎలా చెబుతున్నాడు?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?