అమ్మాయితో రొమాంటిక్ చాట్.. నగ్నంగా వీడియోలు చివరకు..

Published : Apr 12, 2021, 12:05 PM ISTUpdated : Apr 12, 2021, 12:16 PM IST
అమ్మాయితో రొమాంటిక్ చాట్.. నగ్నంగా వీడియోలు చివరకు..

సారాంశం

నగ్నంగా వీడియో కాల్స్ , రొమాంటిక్ ఛాట్స్ చేశారు. ఆ తర్వాత వాటిని వీడియోలుగా తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించి డబ్బులు గుంజడం మొదలుపెట్టారు. 

ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో.. అమ్మయి పేరుతో ఐడీ క్రియేట్ చేసి.. నగ్నంగా వీడియో కాల్స్ , రొమాంటిక్ ఛాట్స్ చేశారు. ఆ తర్వాత వాటిని వీడియోలుగా తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించి డబ్బులు గుంజడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పటి వరకు  చాలా మందిని మోసం చేయగా.. ఓ  యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లోకాంటో ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ ..పేరుతో ఓ ఐడి క్రియేట్‌ చేసి, దాని ద్వారా యువకులను మభ్యపెట్టి అమ్మాయిలు అబ్బాయిలు కమ్యూనికేషన్‌ ఉండేలా చూస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తుల బండారం బయటపడింది. సుచిత్ర గోదావరి హోమ్స్‌ ప్రాంతానికి చెందిన కరుణాకర్‌ అనే యువకుడు ప్రైవేట్‌ జాబ్‌ చేస్తుంటాడు.

ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఉన్న డేటింగ్‌ యాప్‌ను సంప్రదించి ఓ మహిళతో మాటలు కలిపాడు. ఇలా వారం రోజుల వ్యవధిలో అతను నగ్నంగా ఉన్న ఫొటోలను ఆ అమ్మాయి సేకరించింది. ఇక అంతే మూడో వ్యక్తి ఎంటరై నీ ఫొటోలను యూట్యూబ్, ఫేస్‌ బుక్‌ పాటు ఇతర  సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌  చేస్తామని డబ్బులు డిమాండ్‌ చేశారు.  దీంతోకరుణాకర్‌ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన ఘటన వివరాలను వెల్లడిస్తూ ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ రమేష్‌ కేసు నమోదు చేసుకుని సైబర్‌ క్రైమ్‌కు సమాచారం ఇచ్చారు.  
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!