జాతి వైరం మరిచి.. ఆకలితో ఉన్న కుక్క పిల్లలకు పాలిచ్చిన పంది.. నిర్మల్ లో అరుదైన ఘటన

Published : Apr 23, 2023, 12:59 PM IST
జాతి వైరం మరిచి.. ఆకలితో ఉన్న కుక్క పిల్లలకు పాలిచ్చిన పంది.. నిర్మల్ లో అరుదైన ఘటన

సారాంశం

ఓ పంది కుక్క పిల్లలకు పాలిచ్చిన అరుదైన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

సాధారణంగా పందులు కుక్కలకు మధ్య వైరం కనిపిస్తుంది. పందులు కనిపిస్తే కుక్కలు తరుముతాయి. అలాగే చిన్న కుక్కలు పిల్లలు కనిపిస్తే పందులు వాటి వెంట పడుతుంటాయి. కానీ కొన్ని సార్లు దీనికి విరుద్దంగా జరుగుతుంటుంది. ఈ రెండు జాతులు కలిసి మెలిసి ఉన్న ఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి పరిణామమే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం.. ఒక్కొక్కరిపై రూ.14 లక్షల రివార్డు

నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. జాతివైరాన్ని మరిచి రెండు జంతు జాతులు అన్యోన్నంగా కలిసి ఉన్నాయి. ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలకు ఓ పంది పాలు ఇచ్చింది. తన స్వచ్చమైన తల్లి హృదయం చాటి చెప్పింది. దీనిని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా ఇప్పుడది వైరల్ గా మారింది. జాతి వైరాలను మరిచిపోయి ఎంతో ఆప్యాయంగా ఉంటున్న జంతువులను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

హమ్మయ్య.. ఎట్టకేలకు పంజాబ్ పోలీసులకు చిక్కిన అమృత్ పాల్ సింగ్.. అస్సాంలోని దిబ్రూగఢ్ కు తరలింపు..

ఇదిలా ఉండగా.. వారం రోజుల కిందట కూడా ఇలాంటి అరుదైన ఘటనే హన్మకొండలో వెలుగు చూసింది. అయితే అక్కడ ఓ పంది పిల్లకు కుక్క పాలు ఇచ్చింది. 19వ డివిజన్ లోని కాశీ బుగ్గ సొసైటీ కాలనీలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?