ధర్మపురి అసెంబ్లీ: స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టిన అధికారులు

By narsimha lodeFirst Published Apr 23, 2023, 11:50 AM IST
Highlights

ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్  స్ట్రాంగ్ రూమ్ తాళాలను  ఇవాళ పగులగొట్టారు.  హైకోర్టు ఆదేశాలతో  తాళాలు బద్దలు కొట్టారు. ఈసీ అధికారులు, అభ్యర్ధుల సమక్షంలో తాళాలు  పగులగొట్టారు. 
 


కరీంనగర్: ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ తాళాలను  ఆదివారంనాడు  పగులగొట్టారు అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకు  అధికారులు  ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను  బద్దలు కొట్టారు స్ట్రాంగ్ రూమ్ లోని  17 ఏ, 17 'సీ  ఫామ్స్ తో పాటు కౌంటింగ్  హల్ లోని సీసీ టీవీ పుటేజీని   హైకోర్టుకు  సమర్పించనున్నారు అధికారులు.ఈ నెల  26న  హైకోర్టుకు  నివేదికను అందించనున్నారు అధికారులు.  ఇవాళ  ఉదయం  11 గంటల సమయంలో ఈసీ ప్రతినిధులు , కలెక్టర్,  అభ్యర్ధుల  సమక్షంలో  స్ట్రాంగ్ రూమ్  తాళాలు పగులగొట్టారు  అధికారులు.

దర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్  కు చెందిన స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగులగొట్టాలని తెలంగాణ హైకోర్టు ఈ నెల  19న జగిత్యాల జిల్లా కలెక్టర్ ను  ఆదేశించారు.  నియోజకవర్గంలోని ప్రతి పోలీంగ్ స్టేషన్ లోని  ఓట్లు,  ఓట్ల శాతం  వివరాలను  అందించాలని హైకోర్టు ఆదేశించింది.  ఈ వివరాలను  అందించేందుకు  వీలుగా  స్టాంగ్ రూమ్ తాళాలను బద్దలు కొట్టాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు  ఇవాళ స్ట్రాంగ్ రూమ్ తాళాలను  బద్దలుగొట్టారు అధికారులు.

  ధర్మపురి అసెంబ్లీ స్థానంనుండి  2018 అసెంబ్లీ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధి  కొప్పుల ఈశ్వర్  440 ఓట్ల మెజారిటీతో  తన  సమీప  కాంగ్రెస్ అభ్యర్ధి  అడ్లూరి లక్ష్మణ్ పై  విజయం సాధించారు. ఈ విషయమై  అడ్లూరి లక్ష్మణ్  హైకోర్టును ఆశ్రయించారు.   నియోజకవర్గంలోని  పోలింగ్ స్టేషన్ల వారీగా  వివరాల కోసం  స్టాంగ్ రూమ్ తెరవాలని  హైకోర్టు ఆదేశించింది. అయితే  స్ట్రాంగ్ రూమ్ తాళాలు  మిస్సయ్యాయి.  

ఈ విషయాన్ని  ఎన్నికల సంఘం  కూడా   సీరియస్ గా తీసుకుంది.  జగిత్యాలలో  పనిచేసిన అధికారులను ఈ విషయమై  ఈసీ అధికారుల బృదంద  ప్రశ్నించింది.   స్ట్రాంగ్ రూమ్  తాళాలు  మిస్సైన   విషయాన్ని  హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో   తాళాలను పగులగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల  10వ తేదీన  ధర్మపురి స్ట్రాంగ్  రూమ్   తలుపులు  తెరవాలని కలెక్టర్  భావించారు. కానీ  తాళాలు  లేకపోవడంతో   స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవలేదు. 

click me!