కేసీనో నడిపించిన చీకోటి ప్రవీణ్ కు చెందిన పామ్ హౌస్ లో అటవీశాఖాధికారులు శుక్రవారం నాడు తనిఖీలు చేశారు. వైల్డ్ ఎనిమల్స్ ఈ ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా గుర్తించారు. వైల్డ్ ఎనిమిల్స్ యాక్ట్ ప్రకారంగా ప్రవీణ్ పై చర్యలు తీసుకొంటామని అధికారులు తెలిపారు.
హైదరాబాద్: Casino నడిపించిన చీకోటి ప్రవీణ్ కు చెందిన ఫామ్ హౌస్ లో అటవీశాఖాధికారులు శుక్రవారం నాడు తనిఖీలు చేశారు. అటవీశాఖ నిబంధనలకు విరుద్దంగా ఫామ్ హౌస్ లో ఉన్న జంతువులు, పక్షులను తరలిస్తామని Forest Officers చెబుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని kadthal లో సుమారు 20 ఎకరాల్లో ఈ Farm House ఉంది. ఈ ఫామ్ హౌస్ ఆఫ్రికన్ జాతికి చెందిన బల్లులు, పాములున్నాయని అటవీశాఖాధికారులు గుర్తించారు. డిప్యూటీ రేంజ్ పారెస్ట్ ఆపీసర్ హేమ నేతృత్వంలోని అటవీశాఖాధికారులు శుక్రవారం నాడు ప్రవీణ్ ఫామ్ హౌస్ ను తనిఖీ చేశారు.Wild Animals ను ఫామ్ హౌస్ లలో ఉంచకూడదని ఫారెస్ట్ అధికారుల తెలిపారు. పెంపుడు జంతువులుగా ఉండాల్సిన వాటిని ఫామ్ హౌస్ లో ఉంచుకోవచ్చన్నారు. వైల్డ్ ఎనిమిల్స్ ను పెంచుకోవడం నేరంగా అటవీశాఖాధికారులు చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా వైల్డ్ ఎనిమిల్స్ ను ఫామ్ హౌస్ లో పెంచుతున్న Chikoti Praveen పై చర్యలు తీసుకొంటామని అటవీశాఖాధికారి హేమ తెలిపారు.ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. వీకేండ్స్ లో కడ్తాల్ లో ప్రవీణ్ తన ఫామ్ హౌస్ లో గడిపేవాడని స్థానికులు చెబుతున్నారు.
undefined
ఈ నెల 27 వతేదీన ప్రవీణ్ తో పాటు ఆయన అనుచరుడు మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్ సహా ఎనిమిది చోట్ల సోదాలు చేశారు. ఈ సమయంలో కడ్తాల్ లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు.ఈ సోదాలు చేసిన సమయంలో ఈ పామ్ హౌస్ లో వైల్డ్ ఎనిమిల్స్ ఉన్న విషయాన్ని గుర్తించిన ఈడీ అధికారులు పారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా ఫారెస్ట్ అధికారులు ఇవాళ ఈ ఫామ్ హౌస్ లో తనిఖీలు చేశారు.
also read:చీకోటి ప్రవీణ్ వాట్సాప్ లో కీలక సమాచారం: డేటాను పరిశీలిస్తున్న ఈడీ అధికారులు
20 గంటల పాటు ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆగష్టు 1న విచారణకు రావాలని కూడా ప్రవీణ్ ను, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. లీగల్ గా కేసినో ఎక్కడుందో అక్కడే తాను కేసినో నిర్వహించినట్టుగా ప్రవీణ్ ప్రకటించారు. నేపాల్, సింగపూర్ వంటి దేశాలకు తీసుకెళ్లి కేసినో ఆడించాడని ఈడీ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ నుండి సీజ్ చేసిన లాప్ టాప్ లు, మొబైల్స్ నుండి కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించినట్టుగా మీడియా చానల్స్ రిపోర్టు చేస్తున్నాయి. ఈ విషయమై ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది. ప్రవీణ్ వాట్సాప్ సమాచారం ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించినట్టుగా ఈ కథనం తెలిపింది.
వాట్పాప్ ద్వారా ప్రవీణ్ ఎవరెవరితో ఏం చాటింగ్ చేశారనే విషయమై ఈడీ అధికారులు సమాచారాన్ని సేకరించారు.ఈ సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చీకోటి ప్రవీణ్ తో ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయాన్ని సేకరించి వారిని కూడా ఈడీ అధికారులు