అనుకూల వాతావరణం, సెప్టెంబర్‌లో ఖమ్మంలో భారీ సభ: టీడీపీ నేతలతో చంద్రబాబు

By narsimha lode  |  First Published Jul 29, 2022, 11:53 AM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి ప్రజల నుండి ఆదరణ ఉందని దీన్ని ఉపయోగించుకోవాలని  టీడీపీ చీఫ్ చంద్రబాబు సూచించారు.  సెప్టెంబర్ రెండో వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు బాబు  కోరారు. 
 



ఖమ్మం: ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో Khammam లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని TDP  చీఫ్ Chandrababu Naidu తెలంగాణ టీడీపీ నేతలను ఆదేశించారు.  Andhra Pradesh, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న విలీన  మండలాల్లోని వరద ముంపు గ్రామాల్లో  చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. గురువారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తన పర్యటనను ప్రారంభించారు.

 గురువారం నాడు Bhadrachalam లోనే చంద్రబాబు బస చేశారు. పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత చంద్రబాబునాయుడు భద్రాచలంలో శ్రీసీతారామస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Latest Videos

undefined

 శుక్రవారం నాడు ఉదయం  ఉమ్మడి Khammam, Mahabubabadజిల్లాల కమిటీలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు సమావేశమయ్యారు.  తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి అనుకూలమైన వాతావరణం ఉందని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా పార్టీ నేతలకు చెప్పారు. ప్రజల్లో అనుకూలమైన సంకేతాలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. 

ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. సెప్టెంబర్ రెండో వారంలో ఖమ్మంలో బారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని  చంద్రబాబు కోరారు. తెలంగాణలో టీడీపీకి అద్భుతమైన స్పందన ఉందని చంద్రబాబు చెప్పారు. పార్టీకి తెలంగాణలో మళ్లీ అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చంద్రబాబు చెప్పారు.

Hyderabadలోనే టీడీపీ ఆవిర్భవించిన విషయాన్ని చంద్రబాబు పార్టీ నేతలకు గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా టీడీపీకి కంచుకోట అనే విషయాన్ని పార్టీ శ్రేణులకు చంద్రబాబు గుర్తు చేశారు.

 తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటానని చంద్రబాబు చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ రెండు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది.  సత్తుపల్లి, ఆశ్వరావుపేట అసెంబ్లీ స్థానాల్లో  టీడీపీ అభ్యర్ధులు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు విజయం సాధించారు. 

also read:తెలంగాణలో టీడీపీ మళ్లీ ఫామ్ లోకి వస్తుంది.. యువత కోసం ఉండాల్సిందే.. చంద్రబాబు

 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొంత కాలానికే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరారు. చాలా కాలం పాటు టీడీపీలోనే కొనసాగన మెచ్చా నాగేశ్వరరావు ఇటీవలనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.

చంద్రబాబును కలిసిన పోడెం వీరయ్య

ఐదు వీలీన గ్రామాలను భద్రాచలంలో కలిపేందుకు సహకరించాలని భద్రాలచం ఎమ్మెల్యే వీరయ్యతో పాటు అఖిలపక్షం నేతు చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు.  ఇటీవల గోదావరికి వరదలు వచ్చిన సమయంలో ఏపీ రాష్ట్రం నుండి ఈ ఐదు గ్రామాలకు వచ్చి సహాయం చేయడంలో అధికారులు ఇబ్బంది పడ్డారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరికి వరద నీరు రాకుండా కరకట్ట నిర్మాణానికి ఈ ఐదు గ్రామాల్లో కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు.  ఈ  ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ గ్రామాల ప్రజలు కూడా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.

click me!