భద్రాద్రి జిల్లాలో కరోనా కలకలం... ఒకే స్కూల్లో ఐదుగురు స్టూడెంట్స్ కి పాజిటివ్

By Arun Kumar PFirst Published Sep 26, 2021, 1:51 PM IST
Highlights

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ కరోనా కలకలం మొదలయ్యింది. తాజాగా ఖమ్మం జిల్లాలో ఒకే పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు కరోనాబారిన పడ్డారు.

భద్రాద్రి: తెలంగాణలో స్కూల్స్ మొదలయ్యాయో లేదో కరోనా కలకలం మొదలయ్యింది. ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ మహమ్మారి బారిన పడగా తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలం కోయగూడెం పంచాయితీ పరిధిలోని దంతెలవాడలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా  విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కరోనా భయం మొదలయ్యింది.  

దంతెలవాడ గ్రామంలో ఇటీవల జ్వరాలు విజృంభించడంతో అప్రమత్తమైన విద్యాధికారులు విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించారు. మొత్తం 29మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు టెస్ట్ చేయగా ఐదుగురికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కరోనా సోకిన వారిలో ఓ అంగన్ వాడీ చిన్నారి కూడా వుంది.

విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో గ్రామస్తులకు కూడా పరీక్షలు నిర్వహించారు. దీంతో మరో ఐదుగురు గ్రామస్తులకు కూడా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామస్తులు ఇళ్లలోంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. విద్యార్థులకు కరోనా సోకడంతో ముందుజాగ్రత్తగా పాఠశాలకు మూడురోజులు సెలవు ప్రకటించారు. గ్రామంలో కూడా కరోనా నిబంధనలను తిరిగి అమలు చేస్తున్నారు. 

ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే గడచిన 24 గంటల్లో అతితక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి.  తెలంగాణవ్యాప్తంగా 52,702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా కేవలం 248 మందికి మాత్రమే పాజిటివ్‌‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 21, నల్గొండ జిల్లాలో 17 కేసులు గుర్తించారు. నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 324 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,64,898కి చేరింది. తెలంగాణలో మొత్తం 6,56,285 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,701 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారినపడిన మృతి చెందిన వారి సంఖ్య 3,912కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 66, జగిత్యాల 9, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 21, ఖమ్మం 13, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 4, మంచిర్యాల 6, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 10, ములుగు 2, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 17, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 4 , పెద్దపల్లి 10, సిరిసిల్ల 4, రంగారెడ్డి 18, సిద్దిపేట 2, సంగారెడ్డి 5, సూర్యాపేట 8, వికారాబాద్ 3, వనపర్తి 1, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 13, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.
 

click me!