భూపాలపల్లిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా.. ఒకరి పరిస్థితి విషమం..

Published : Dec 25, 2023, 09:10 AM IST
భూపాలపల్లిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా.. ఒకరి పరిస్థితి విషమం..

సారాంశం

 భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ అనే 65యేళ్ల మహిళకు గత మూడు రోజుల క్రితం కరోనా వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా, ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. 

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆదివారం ఓ కుటుంబంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ అనే 65యేళ్ల మహిళకు గత మూడు రోజుల క్రితం కరోనా వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా, ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. 

ఆ తరువాత ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఇంట్లోని మిగతా నలుగురికి కూడా కరోనా అనుమానంతో వారిని ఐసోలేషన్ లో ఉన్నారు. వీరికీ కరోనా అని తేలింది. కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో భాస్కర్ (42), వీణ (30), ఆకాష్ (13), మిద్దిని (5)లు ఉన్నారు. వీరంతా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ సలహా మేరకు మందుల వాడుతున్నారు. దీంతో కలిసి తెలంగాణలో మొత్తం యాక్టివ్ గా ఉన్న కేసులు 50కి చేరుకున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్