సంగారెడ్డి జిల్లాలో ఘోరప్రమాదం: కారు,లారీ ఢీ...ఐదుగురు మృతి

Published : Aug 06, 2021, 03:17 PM ISTUpdated : Aug 06, 2021, 03:35 PM IST
సంగారెడ్డి జిల్లాలో ఘోరప్రమాదం:  కారు,లారీ ఢీ...ఐదుగురు మృతి

సారాంశం

 సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చౌటకూరు వద్ద కారును లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

సంగారెడ్డి: జిల్లాలోని  పుల్కల్ మండలం చౌటకూరులో శుక్రవారం నాడు  ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. కారును లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు.కారులో సంగారెడ్డి నుండి మెదక్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మృతుల్లో ఇద్దరు మహిళలు సహా ఆరేళ్ల చిన్నారి కూడ ఉన్నారు. మరో ఇద్దరు పురుషులు కూడ ఈ ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తేలుస్తోంది.

 

 

మెదక్ జిల్లా రంగంపేట కు చెందిన  పద్మ, దాస్ భార్యాభర్తలు. వీరి కొడుకుకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. రంగంపేట నుండి సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్న తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ కారులోని ఇద్దరు ఎవరనే విషయమై ఇంకా ఆచూకీ తెలియాల్సి ఉంది.అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!