మంచిర్యాల జిల్లాలో దారుణం... దివ్యాంగ బాలుడిపై ఐదుగురి లైంగికదాడి

Arun Kumar P   | Asianet News
Published : Oct 10, 2021, 08:49 AM IST
మంచిర్యాల జిల్లాలో దారుణం... దివ్యాంగ బాలుడిపై ఐదుగురి లైంగికదాడి

సారాంశం

అభం శుభం తెలియని ఓ దివ్యాంగ బాలుడిపై జాలిచూపాల్పింది పోయి కొందరు యువకులు లైంగింకదాడికి పాల్పడ్డారు. ఈ అసహజ దుర్ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జైపూర్: అమ్మాయిలకే కాదు అబ్బాయిల మానప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఓ దివ్యాంగుడి అసహాయ స్థితిని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే.... మంచిర్యాల జిల్లా  జైపూర్ మండలంలోని ఓ గ్రామంలో దివ్యాంగ బాలుడు నివాసముంటున్నాడు. అతడి అసహాయతను ఆసరాగా చేసుకుని అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు అతడిపై కన్నేసారు. బాలుడికి మాయమాటలు చెప్పి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఒకరిద్దరు కాదు చాలామంది యువకులు ఇప్పటివరకు దివ్యాంగుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 

read more  మహారాష్ట్రలో దోపిడీదొంగల కిరాతకం.... కదులుతున్న రైల్లో యువతిపై గ్యాంగ్ రేప్

కొంతకాలంగా దివ్యాంగ బాలుడి ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు తాజాగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఆరా తీయగా తనపై జరిగిన అఘాయిత్యం గురించి బయటపెట్టాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దివ్యాంగ బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడింది కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్‌, మహమ్మద్‌ సాదీక్‌, గడ్డం నందు, బోగె రాయలింగం గా పోలీసులు నిర్దారించారు. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు జైపూర్ పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ