మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్.. అభినందించిన డా. ఆర్.జి. ఆనంద్

By AN TeluguFirst Published Dec 18, 2020, 5:01 PM IST
Highlights

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డా. ఆర్.జి. ఆనంద్ రాచకొండలో ఏర్పాటు చేసిన మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఆయనతో పాటు మహేష్ భగవత్, ఐపిఎస్, పోలీసు కమిషనర్,  వీరితో పాటు రాచకొండ బిబిఎ, సిడబ్ల్యుసి ఇతర పోలీసు అధికారులు ఉన్నారు. 

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డా. ఆర్.జి. ఆనంద్ రాచకొండలో ఏర్పాటు చేసిన మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఆయనతో పాటు మహేష్ భగవత్, ఐపిఎస్, పోలీసు కమిషనర్,  వీరితో పాటు రాచకొండ బిబిఎ, సిడబ్ల్యుసి ఇతర పోలీసు అధికారులు ఉన్నారు. 

మేడిపల్లి పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ రూంను, పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. ఎన్ సిపిసిఆర్ గైడ్ లైన్స్ ఎన్‌సిపిసిఆర్ మార్గదర్శకాలను అనుసరించి, పోక్సో చట్టం -2012, బాల కార్మిక (ప్రొహిబిటియోయిన్ అండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ 2006) మరియు బాల్యవివాహాల నిషేధ చట్టం -2006, జువెనైల్ జస్టిస్ చట్టం (పిల్లల సంరక్షణ మరియు రక్షణ -2000)లకు అనుగుణంగా బాగా ఉందని ప్రశంసించారు. 

రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి వివరించారు. ఈ పోలీసులు బాల్యవివాహాల నివారణ, చట్టానికి లోబడి ఉన్న పిల్లలు, చట్ట రక్షణ అవసరమైన పిల్లలు,  సంరక్షణ అవసరమైన పిల్లల కోసం ఎలా పనిచేస్తుందో ఒడిశాలోని వలస కార్మికుల పిల్లల కోసం వర్క్‌సైట్ పాఠశాలకు సంబంధించిన వీడియోతో వివరించారు.

ప్రతీ పిల్లవాడికి సరైన న్యాయం అందించేలా కృషి చేస్తామని ఉమెన్ ఆఫీసర్ ఎ. కుమారి, సబ్ ఇన్స్ పెక్టర్ జి. చంద్రశేఖర్ లు తెలిపారు. రాచకొండ పోలీసులు, శిశు సంక్షేమ సంస్థల మధ్య సమన్వయంతో ఎలా పనిచేస్తుందో బిబిఎ బృందం, సిడబ్ల్యుసి బృందం వివరించింది.

డా. ఆర్.జి. ఆనంద్ అక్కడున్న కొంతమంది పిల్లలతో సంభాషించారు. పోలీసుల ప్రయత్నాలను ప్రశంసించారు. రాచకొండ పోలీసుల రోల్ మోడల్ గా నిలుస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.

తెలంగాణ ప్రభుత్వ ఈ కృషిని జాతీయ కమిషన్ దృష్టికి తీసుకువస్తానని ఆనంద్ అన్నారు. అంతేకాదు తెలంగాణ స్పూర్తిని ఇతర రాష్ట్రాలకూ తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమానికి డిసిపి క్రైమ్స్ యాదగిరి, ఎసిపి మల్కాజిగిరి శ్యామ్ ప్రసాద్, ఎస్‌హెచ్‌ఓ అంజి రెడ్డి, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో మెదక్ కు చెందిన బాలుడు ఇషాన్ ఒకరోజు పోలీసు కమిషనర్ గా వ్యవహరించాడు. ఇషాన్ కమిషనర్ హోదాలో గౌరవ సభ్యుడు డాక్టర్ ఆర్ జి ఆనంద్‌కు పూల గుత్తి ఇచ్చి స్వాగతం పలికారు.

click me!