చిన్నారి ప్రాణం తీసిన ఈత సరదా... తల్లి ప్రయత్నాలు విఫలం..

Published : Dec 18, 2020, 02:51 PM IST
చిన్నారి ప్రాణం తీసిన ఈత సరదా... తల్లి ప్రయత్నాలు విఫలం..

సారాంశం

ఈత సరదా ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. కొడుకును కాపాడుకోవడానికి ఆ తల్లి చేసిన విశ్వప్రయత్నం విఫలమయ్యింది. చివరికి చిన్నారి ప్రాణాలు నీటిగుంతలో కలిసిపోయాయి. 

ఈత సరదా ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. కొడుకును కాపాడుకోవడానికి ఆ తల్లి చేసిన విశ్వప్రయత్నం విఫలమయ్యింది. చివరికి చిన్నారి ప్రాణాలు నీటిగుంతలో కలిసిపోయాయి. 

మూసాపేటలో జరిగిన ఈ విషాదం ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బతుకుదెరువు కోసం శ్రీకాకుళం నుంచి హైదర్‌బాద్‌కు వచ్చిన వెంకట్రావ్‌ భార్య, ఇద్దరు పిల్లలతో మూసాపేటలో నివాసం ఉంటున్నాడు. 

రోజూలానే తల్లిదండ్రులిద్దరు పనులకు వెళ్లారు. ఎనిమిదేళ్ల చిన్న కొడుకు నవీన్ కు ఈత అంటే సరదా. తల్లిదండ్రులిద్దరూ లేకపోవడంతో  నవీన్‌ స్నేహితులతో కలసి ఈత కొట్టడానికి వెళ్లాడు.  
ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో మునిగిపోయాడు. 

ఈ విషయం తెలుసుకున్న తల్లి కుమారుడిని రక్షించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నోట్లో నోరుపెట్టి కృత్రిమ శ్వాసను అందించినా ప్రయత్నం​ ఫలించలేదు. అ‍యితే వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.  

PREV
click me!

Recommended Stories

ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే