రైలు ప్రమాదంపై తెలంగాణ డీజీపీ ట్వీట్.. ‘అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు’

Published : Jul 07, 2023, 03:37 PM IST
రైలు ప్రమాదంపై తెలంగాణ డీజీపీ ట్వీట్.. ‘అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు’

సారాంశం

హైదరాబాద్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.  

హైదరాబాద్: తెలంగాణలో రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. యాదాద్రి జిల్లాలో బీబీ నగర్ మండలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. యాదాద్రిలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.

భోనగిరి రూరల్ పీఎస్ పరిధిలో ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయని ఆయన పేర్కొన్నారు. ఈ రైలు నుంచి ప్రయాణికులు అందరినీ సురక్షితంగా బయటకు తీయగలిగామని వివరించారు. వారిని బస్సులో ఎక్కించి తరలించామని పేర్కొన్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, రైల్వే శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదం ఒక్క మరణం కూడా సంభవించలేదని వెల్లడించారు.

 

Also Read: Islam Nusantara: ఐఎస్ఐఎస్ తీవ్రవాద భావజాలానికి ఇండియోనేషియా కౌంటర్ ఇదే

ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌‌కు మొత్తం 18 బోగీలు ఉండగా.. 11 బోగీలను ఇంజిన్ నుంచి వేరు చేశారని, వాటిని సేఫ్‌గా తీసుకెళ్లారని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఏడు బోగీల్లో మంటలు వ్యాపించాయని, అందులో మూడు బోగీల్లో ఇప్పటికే మంటలను పూర్తిగా ఆర్పేసినట్టు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు చేసిన ట్వీట్‌లో వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?