టిఎస్ఆర్టిసి రాజధాని ఎక్స్ప్రెస్ బస్సులో అగ్నిప్రమాదం..

Published : Jul 07, 2023, 06:33 AM ISTUpdated : Jul 07, 2023, 06:34 AM IST
టిఎస్ఆర్టిసి రాజధాని ఎక్స్ప్రెస్ బస్సులో అగ్నిప్రమాదం..

సారాంశం

హైదరాబాద్ లో టీఎస్ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఓ టిఎస్ఆర్టిసి బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు మొత్తానికి మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ మిర్రర్ లో మంటలను చూసి బస్సు ఆపి.. ప్రయాణికులు అప్రమత్తం చేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
పెద్ద అంబర్పేట్ ఓనర్ వద్ద రాజధాని ఎక్స్ప్రెస్ బస్సులో మంటలు చెలరేగి, బస్సు కాలి బూడిదయ్యింది. బస్సు హైదరాబాద్ బీహెఈల్ నుంచి గుంటూరు వెడుతుండగా ఘటన  చోటు చేసుకుంది. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్