హైద్రాబాద్ అత్తాపూర్‌లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

Published : May 18, 2023, 05:45 PM ISTUpdated : May 18, 2023, 05:52 PM IST
హైద్రాబాద్ అత్తాపూర్‌లో  అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

సారాంశం

హైద్రాబాద్  అత్తాపూర్ లో ని ఓ వర్క్ షాపులో  ఇవాళ అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. సకాలంలో  ఫైరింజన్లు  చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి.

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ లో  గురువారంనాడు అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  స్క్రాప్ షాప్  లో  ఇవాళ  అగ్ని ప్రమాదం చోటు  చేసుకుంది.  దీంతో  భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.  ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు  100  నెంబర్ కు  డయల్  చేశారు.  వెంటనే   పోలీసులు  సంఘటనస్థలానికి  చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బందిని  కూడా సమాచారం ఇచ్చారు.  రెండు ఫైరింజన్లు  సంఘటన స్థలానికి  చేరుకొని  మంటలను  ఆర్పుతున్నాయి.  ఈ స్క్రాప్ షాప్ పక్కనే వాహనాల  బాడీ తయారు  చేసే గోడౌన్  కూడా  ఉంది.  స్క్రాప్ షాప్ లో  అగ్ని ప్రమాదానికి   షార్ట్ సర్క్యూట్  కారణమా  ఇతర కారణాలా అనే విషయమై  స్పష్టత రావాల్సి ఉంది.  

స్క్రాప్ షాపులోని సిలిండర్లు  పేలుతుండడంతో  స్థానికులు భయాందోళనలు వ్యక్తం  చేస్తున్నారు.  సంఘటన స్థలానికి  సమీపంలోనే  జనావాసాలున్నాయి.  దీంతో  మంటలు జనావాసాల వైపునకు వెళ్లకుండా  అగ్నిమాపక సిబ్బంది   జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  నాలుగు  ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. వేసవి కాలంలో  తరచూ అగ్ని ప్రమాదాలు  చోటు  చేసుకుంటాయి . అయితే  ముందు జాగ్రత్తలు  తీసుకోవడంతో  అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని  అగ్నిమాపక సిబ్బంది  చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu