ఓ మెట్టు దిగుతా: పార్టీని వీడినవారిని కాంగ్రెస్ లో కి రావాలని ఆహ్వానించిన రేవంత్

By narsimha lode  |  First Published May 18, 2023, 5:03 PM IST


పార్టీని వీడినవారంతా  కాంగ్రెస్ లో  చేరాలని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  కోరారు. 


హైదరాబాద్:  పార్టీని వీడిన వారంతా  తిరిగి రావాలని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  కోరారు.  అవసరమైతే తాను  ఓ మెట్టు దిగుతానని  రేవంత్ రెడ్డి  ప్రకటించారు.గురువారంనాడు  గాంధీ భవన్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదించేందుకు  కలిసి  పోరాటం  చేద్దామని ఆయన  కోరారు.వివేక్ వెంకటస్వామి,  కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా  పార్టీ నుండి  ఇతర పార్టీల్లో  చేరిన నేతలంతా  కాంగ్రెస్ లోకి రావాలని  రేవంత్ రెడ్డి కోరారు.

తెలంగాణలో  కేసీఆర్  ను ఓడించేందుకు  ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.   పార్టీని వీడిన నాయకులతో  తనకు  ఏమైనా అవమానాలు జరిగినా  తనకు  ఇబ్బంది లేదన్నారు.  అవసరమైతే తాను  ఓ మెట్టు దిగుతానని  ఆయన  చెప్పారు.  తెలంగాణలో  కాంగ్రెస్ ను బలోపేతం  చేసేందుక  తమతో  కలిసి రావాలని  రేవంత్ రెడ్డి కోరారు.  తానే  మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో  పనిచేస్తున్నానని  రేవంత్ రెడ్డి  చెప్పారుతనతో  ఇబ్బంది అనుకుంటే  పార్టీలో  ఉన్న ఇతర సీనియర్లతో  చర్చించాలని  కూడా  రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ అమ్మ వంటిందన్నారు. అందరూ ఆదరించాలని  ఆయన  కోరారు. 

Latest Videos

undefined

also read:కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు‌పై కేసీఆర్ వ్యాఖ్యలు: మండిపడ్డ రేవంత్ రెడ్డి

కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల  తర్వాత  కొందరు నేతలు  కాంగ్రెస్ లో  చేరుతారని  ప్రచారం సాగుతుంది.  మునుగోడు మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో  చేరుతారని  ప్రచారం సాగింది.  ఈ విషయమై  ఆయన  స్పష్టత  ఇచ్చారు.  తనను కాంగ్రెస్ లో  చేరాలని  కోరారని  చెప్పారు.  కానీ  తాను  కేసీఆర్ ను ఓడించేందుకు బీజేపీలో  చేరినట్టుగా  తెలిపారు.  తాను మాత్రం  బీజేపీని వీడడం లేదన్నారు.  

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా  కాంగ్రెస్ లో  చేరుతారని  మీడియాలో  వార్తలు వచ్చాయి.ఈ వార్తలను ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా  ఈటల రాజేందర్  ఈ విషయంపై  స్పష్టత ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో  మరో ఆరు మాసాల్లో  ఎన్నికలు  రానున్నాయి.. కొందరు నేతలు  బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారని  వార్తలు వచ్చిన మరునాడే  రేవంత్ రెడ్డి  ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

click me!