మంచిర్యాలలో జోగు రామన్నకు తప్పిన ముప్పు (వీడియో)

Published : Feb 17, 2018, 01:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మంచిర్యాలలో జోగు రామన్నకు తప్పిన ముప్పు (వీడియో)

సారాంశం

మున్నూరు కాపు భవన శంకుస్థాపనలో అపశృతి బాణసంచా పేలుడతో వేదికకు అంటుకున్న మంటలు సేఫ్ గా బయటపడ్డ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు

తెలంగాణ అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ముప్పు తప్పింది. ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎసిసి ప్రాంతంలో మున్నూరు కాపు భవన శంఖుస్థాపన కార్యక్రమానికి మంత్రి జోగు రామన్న వచ్చారు. ఆయన తో పాటు మూడు నియోజక వర్గాల శాసన సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భవన విఐపిలు వస్తున్న సందర్భంలో పటాకులు కాల్చారు. అయితే బాణసంచా వేదిక దగ్గర్లో పేల్చారు. ఈ సమయంలో మంటలు వ్యాపించి వేదిక కోసం ఏర్పాటు చేసిన టెంట్లపై నిప్పు రవ్వలు పడి అంటుకున్నాయి. దీంతో మంత్రి సహా అక్కడున్నవారంతా వేదిక ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. తర్వాత మున్నూరు కాపు ప్రతినిధులు ఆ మంటలు ఆర్పేశారు. మంటలు అంటుకున్న వీడియో కింద చూడొచ్చు.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?