Fire accident: హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..

Published : Aug 16, 2023, 10:55 PM IST
Fire accident: హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..

సారాంశం

Hanamkonda: హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.  

Fire breaks out at maternity hospital: హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. హన్మకొండ జిల్లాలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్, ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే, వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. ఆస్తి నష్టం కూడా పెద్ద‌గా జ‌రగ‌లేద‌ని స‌మాచారం.

ఆస్ప‌త్రి భవనం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంట‌నే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీనిపై ద‌ర్యాప్తు చేస్తామ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

కాగా, ఈ ఏడాది మార్చిలో సికింద్రాబాద్ లోని 8 అంతస్తుల స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని ఐదో అంతస్తు ఎయిర్ కండిషనింగ్ యూనిట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పై అంతస్తులకు భారీగా మంటలు వ్యాపించడంతో ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల్లో ఇది తాజాది. మృతులను ప్రమీల, వెన్నెల, శ్రావణి, శివగా గుర్తించారు. కారిడార్లలో మంటలు చెలరేగడంతో ఐదో అంతస్తులోని వాష్ రూమ్  ద‌గ్గ‌ర ఊపిరాడక మృతి చెందిన ఆరుగురిలో 25 ఏళ్ల త్రివేణి, ప్రశాంత్ ఉన్నారు. ఈ ప్ర‌మాదం నుంచి మరో 12 మందిని రక్షించామని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ లో అత్యంత పురాతనమైన వాణిజ్య సముదాయం అగ్ని ప్ర‌మాదానికి గురికావ‌డం దశాబ్ద కాలంలో ఇది రెండోసారి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్