హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

By narsimha lode  |  First Published Sep 13, 2022, 3:51 PM IST


హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు ఫైరింజన్లు మంటలు ఆర్పుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదం జరిగిన కార్యాలయంలో  ఎవరూ లేరు.  ఈ కార్యాలయం నుండి పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్  రోడ్డు నెంబర్ 36 లోని ఓ కార్యాలయంలో మంగళవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఫైరింజన్లు  మంటలను ఆర్పుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన కార్యాలయంలో ఎవరూ లేరని సెక్యూరిటీ సిబ్బంది  అగ్నిమాపక సిబ్బందికి  తెలిపారు. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా ఉండేందుకు గాను అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూబ్లీ 800 పబ్ పక్కనే ఉన్న కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

also read:సికింద్రాబాద్ రూబీ లాడ్జీ భవనంలో రెండు లోపాలు: అగ్నిమాపక రీజినల్ అధికారి పాపయ్య

Latest Videos

undefined

సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జీలో సోమవారం నాడు రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు భవన యజమానితో పాటు రూబీ లాడ్జీ సెల్లార్ లో బైక్ షోరూమ్ నిర్వహిస్తున్న రంజిత్ సింగ్ పై  పోలీసులు కేసు నమోదు చేశారు. 

గతంలో కూడ సికింద్రాబాద్ బోయిగూడలో  ఈ ఏడాది మార్చి  23న జరిగిన అగ్ని ప్రమాదంలో బీహర్ రాష్ట్రానికిచెందిన వలస కార్మికులు 11 మంది మరణించారు. ఇటీవలనే తెలంగాణ సీఎం కేసీఆర్ బీహర్ వెళ్లి వలస కార్మికుల కుటుంబాలకు పరిహరం అందించారు. 

click me!