హకీంపేటలో పేలిన గ్యాస్ సిలిండర్లు, చెలరేగిన మంటలు: రంగంలోకి ఫైరింజన్లు

By narsimha lode  |  First Published Jan 22, 2023, 4:00 PM IST


నగరంలోని హకీంపేటలో  సాలార్ జంగ్  బ్రిడ్జి  వద్ద వెల్డింగ్  పనులు  చేస్తున్న సమయంలో  గ్యాస్ సిలిండర్లు పేలాయి.   గ్యాస్ సిలిండర్లు  పేలిన కారణంగా మంటలు చెలరేగాయి.  


హైదరాబాద్:  నగరంలోని హకీంపేటలోసాలార్ జంగ్  బ్రిడ్జి సమీపంలో  గ్యాస్ సిలిండర్లు పేలాయి.దీంతో  మంటలు వ్యాపించాయి.  అగ్నిమాపక సిబ్బంది  మంటలను ఆర్పుతున్నారు.  అక్రమంగా  ఎల్పీజీ   గ్యాస్ సిలిండర్ల నుండి    చిన్న చిన్న గ్యాస్ సిలిండర్లలో  నింపుతున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది.   దీంతో భారీగా మంటలు చెలరేగాయి.  స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఫైర్ ఫైటర్లు  మంటలను ఆర్పుతున్నాయి.  గ్యాస్ సిలిండర్ల పేలుడు సమయంలో భారీగా శబ్దాలు విన్పించాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో  స్థానికులు భయంతో  పరుగులు తీశారు. .  నిబంధనలకు విరుద్దంగా  గ్యాస్ సిలిండర్లు నింపుతున్నారని స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రమాదంలో  ఐదు గ్యాస్ సిలిండర్లు  పేలాయి.  నగరంలో  ఇటీవల కాలంలో  అగ్ని ప్రమాదాలు  ఎక్కువగా  చోటు  చేసుకుంటున్నాయి.

ఈ నెల  20వ తేదీన  సికింద్రాబాద్ రాంగోపాల్ పేట లో  గల  డెక్కన్  నైట్ వేర్  స్టోర్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  నలుగురిని  అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.   మరో వైపు ఈ  భవనంలో పనిచేసే ముగ్గురు కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఈ భవనం సెల్లార్ లో  నిన్న  ఓ ఆస్తిపంజరం లభ్యమైంది. ఇంకా ఇద్దరి ఆచూకీ కోసం  గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. 
 మంటల ధాటికి  ఈ భవనం పూర్తిగా దెబ్బతింది.  

Latest Videos

also read:సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్దం, వ్యర్థాల తొలగింపు

దీంతో  ఈ భవనాన్ని కూల్చి వేయనున్నారు. ఈ భవనంలో  వ్యర్ధాలను  తొలగిస్తున్నారు.మ రో వైపు  ఈ భవనం లోపల పరిస్థితిని  అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ  డీఆర్ఎఫ్ సిబ్బంది పరిశీలించారు. ఈ నెల  21న హైద్రాబాద్ లోని నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో  పార్కింగ్ ఏరియాల్  అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ  పార్క్  చేసిన  కారు లో  అగ్ని ప్రమాదం జరిగింది.ఈ నెల  21న ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బస్టాండ్ లో  అగ్ని ప్రమాదం జరిగింది.  బస్టాండ్ లో  ఉన్న దుకాణంలో మంటలు చెలరేగాయి.  ఒక దుకాణం నుండి మరో దుకాణంలోకి మంటు వ్యాపించాయి.  మొత్తం నాలుగు దుకాణాలు దగ్దమయ్యాయి.

 

click me!