బాలుడి హత్య: తల్లిపై అనుమానాలు, అక్రమ సంబంధం బయటపడుతుందని...?

Published : Nov 18, 2019, 11:52 AM ISTUpdated : Nov 18, 2019, 09:50 PM IST
బాలుడి హత్య: తల్లిపై అనుమానాలు, అక్రమ సంబంధం బయటపడుతుందని...?

సారాంశం

చెల్లెలితో సరదా ఆడుగకుంటున్న బాలుడు అకస్మాత్తుగా మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయాడు. బాలుడిని ఉరేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. తల్లి సునీత ఉరేసి తన కుమారుడిని చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. చెల్లెలితో ఆడుకుంటున్న ఓ బాలుడు హత్యకు గురయ్యాడు. అతన్ని ఉరేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. బాలుడి మెడపై గాయాలు తాడుతో ఉరివేసినట్లు గాయాలుండడంతో ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమారుడి మరణంపై పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో తల్లిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

13 ఏళ్ళ బాలుడు.. 6 ఏళ్ళ బాలిక.. రైస్ మిల్ దగ్గరకు తీసుకెళ్ళి

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్ల్ి మండలం ధర్మారం (బీ) గ్రామంలో ఆదివారంనాడు ఆ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో జన్నెపల్లి అశోక్, సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు .పెద్ద కుమారుడు నాగరాజు పిట్లంలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. చిన్న కుమారుడు రాజేశ్, కూతురు ధనలక్ష్మి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. 

బాలుడి మెడపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో తరుచుగా గొడవ పెట్టుకునే ఇద్దరు మహిళలు రాజేష్ కు చాక్లెట్లు ఇచ్చి గొంతు నులిమి చంపారని తల్లి సునీత పోలీసులకు చెప్పింది. రాజేశ్ కు పాము కాటు వేసిందని, త్వరగా రావాలని భార్య సునీత తనకు ఫోన్ చేసిందని, దాంతో తాను ఇంటికి వచ్చానని భర్త అశోక్ చెబుతున్నాడు. 

13 ఏళ్ళ బాలుడు.. 6 ఏళ్ళ బాలిక.. రైస్ మిల్ దగ్గరకు తీసుకెళ్ళి

కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించడానికి సునీత అంగీకరించలేదు. పైగా పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చింది. దాంతో రాజేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వివాహేతర సంబందాలకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని, ఉరి వేసి చంపి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఇంట్లోంచి పగిలిన గాజులను, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu