నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. దగ్థమవుతున్న నాలుగు కార్లు

Siva Kodati |  
Published : Jan 21, 2023, 08:54 PM ISTUpdated : Jan 21, 2023, 09:00 PM IST
నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. దగ్థమవుతున్న నాలుగు కార్లు

సారాంశం

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో 4కార్లు దగ్థమైనట్లుగా సమాచారం. వీకెండ్ కావడంతో భారీగా సందర్శకులు నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు పోటెత్తారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.ఓ ఎలక్ట్రిక్ కారులోంచి మంటలు ఎగిసిపడినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం కారణంగా నాంపల్లి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం