
హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. మీర్ ఆలం పార్క్ సమీపంలోని గోడౌన్‌లో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో గోడౌన్‌కు చుట్టుపక్కల వున్న నివాస గృహాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.