
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు సీఎం. అంతకుముందు ఉదయం పొత్తికడుపులో అసౌకర్యంగా వుండటంతో కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఎండోస్కోపి, సిటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు.. కడుపులో అల్సర్ ఉన్నట్టుగా నిర్దారించారు. ఈమేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ALso REad: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అల్సర్.. ఏఐజీ ఆస్పత్రి వైద్యుల నిర్దారణ.. హెల్త్ చెకప్ రిపోర్టు విడుదల..
ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కవిత, మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి శనివారం రోజు కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో 8 గంటలకుపైగా విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకుని ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి మరోసారి విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు కవితకు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో కవిత చర్చలు జరిపారు.