భువనగిరిలో భారీ అగ్నిప్రమాదం

Siva Kodati |  
Published : Feb 14, 2021, 09:04 PM IST
భువనగిరిలో భారీ అగ్నిప్రమాదం

సారాంశం

యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ శివారులోని పారిశ్రామిక వాడలో వున్న ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి.

యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ శివారులోని పారిశ్రామిక వాడలో వున్న ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది.

దీంతో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

అగ్నికీలలు చుట్టుపక్కల ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu