ఇది ఆర్టిసి వారి పాట ..! పందెంకోడిని వేలం వేస్తున్న టీఎస్ ఆర్టిసి  

By Arun Kumar P  |  First Published Jan 12, 2024, 6:59 AM IST

ఆర్టిసి బస్సులో చిక్కిన పందెంకోడిని వేలం వేసేందుకు కరీంనగర్ ఆర్టిసి డిపో 2 అధికారులు సిద్దమయ్యారు. 


కరీంనగర్ : సంక్రాంతి పండగ వేళ తెలుగు ప్రజలు సరదాగా కోడి పందేలు ఆడుతుంటారు. ఈ పందేల కోసమే కొందరు ప్రత్యేకమైన కోళ్లను పెంచుతుంటారు. సంక్రాంతి వచ్చిందంటే ఈ పందెం కోళ్లకు యమ గిరాకీ వుంటుంది. ఇలా అమ్మడానికో లేక పందెంలో పాల్గొనడానికి పెంచుకున్నారో ఏమో గానీ ఓ పందెంకోడి ఆర్టిసి బస్సులో మరిచిపోయారు. ఈ పందెంకోడిని వేలం వేసేందుకు ఆర్టిసి అధికారులు సిద్దమయ్యారు. 

వివరాల్లోకి వెళితే...  కరీంనగర్ ఆర్టిసి డిపో-2 కు చెందిన బస్సు ఈ నెల 9న వరంగల్-వేములవాడ మధ్య నడిచింది. రాత్రికి వేములవాడ నుండి కరీంనగర్ డిపోకు    బస్సును చేర్చారు డ్రైవర్, కండక్టర్. డ్యూటీ టైమ్ ముగియడంతో డ్రైవర్, కండక్టర్ బస్సు దిగి వెళ్ళిపోతుండగా హటాత్తుగా వారికి కోడికూత వినిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన వారు బస్సులో పరిశీలించగా ఓ సీటుకింద బుట్టలో పందెంకోడి కనిపించింది. ప్రయాణికులు ఎవరో మరిచిపోయి వుంటారని భావించి ఆ పందెంకోడిని డిపో అధికారులకు అప్పగించి వెళ్ళిపోయారు.

Latest Videos

undefined

Also Read  చిన్నారి ప్రాణాలు బలితీసుకున్న నిమ్మకాయ ... ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది....

అయితే గత రెండ్రోజులుగా ఆ పందెంకోడి కరీంనగర్ ఆర్టిసి డిపో లోనే వుంది. ఆ కోడి యజమాని వస్తే అప్పగించాలని ఆర్టిసి అధికారులు భావించారు... కానీ ఎవరూ  రాలేదు. దీంతో ఆ పందెంకోడిని వేలం వేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఈ పందెంకోడిని వేలం వేస్తామని... ఆసక్తిగలవారు ఈ వేలంపాటలో పాల్గొని కోడిని సొంతం చేసుకోవచ్చని కరీంనగర్ ఆర్టిసి డిపో మేనేజర్ మల్లయ్య ఓ ప్రకటన చేసారు.

వీడియో

click me!