మటన్ ముక్క కోసం..పెళ్లిలో ఘర్షణ

Published : Feb 26, 2019, 11:43 AM IST
మటన్ ముక్క కోసం..పెళ్లిలో ఘర్షణ

సారాంశం

పెళ్లి భోజనంలో మటన్ ముక్క కోసం మొదలైన వివాదం.. తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. భోజనంలో మటన్ వడ్డించలేదనే కారణంతో వరుడి తరపు బంధువులు.. వధువు తరపు బంధువులతో గొడవకు దిగారు.

పెళ్లి భోజనంలో మటన్ ముక్క కోసం మొదలైన వివాదం.. తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. భోజనంలో మటన్ వడ్డించలేదనే కారణంతో వరుడి తరపు బంధువులు.. వధువు తరపు బంధువులతో గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త.. చివరకి కొట్టుకునే దాకా వచ్చింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాకలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉప్పుసాకకు చెందిన అజ్మీరా కుమారి వివాహం కొత్తగూడెనికి చెందిన ప్రవీణ్ తో శుక్రవారం ఉదయం వధువు ఇంటి వద్ద జరిగింది. కాగా.. వివాహ విందులో మటన్ వడ్డించలేదని వరుడు తరపు బంధువులు.. గొడవ దిగారు. మటన్ పెట్టే ఆర్థిక స్థోమత లేక చికెన్ తో భోజనాలు ఏర్పాటు చేశామని.. వధువు తరపు బంధువులు చెప్పినా వారు వినలేదు.

ఈ క్రమంలో మాటామాటా పెరిగి.. ఘర్షణకు దారితీసింది. దీంతో.. కుర్చీలతో ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. ఈ ఘర్షణలో పలువురు గాయాలపాలయ్యారు. అనంతరం ఇరు వర్గీయులు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?