శంషాబాద్ లో.. విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

Published : Feb 26, 2019, 09:54 AM IST
శంషాబాద్ లో.. విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి  తృటిలో పెను ప్రమాదం తప్పింది. 


శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి  తృటిలో పెను ప్రమాదం తప్పింది. 128 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య మొదలైంది.  అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్ అయిన తర్వాత కాసేపు అక్కడే చక్కర్లు కొట్టింది. ఈ పరిణామంతో ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. ఈ దశలో పైలట్ అక్కడే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?