సైడ్ అడిగినందుకు.. వేలు కొరికేశాడు

Published : Feb 26, 2019, 11:22 AM IST
సైడ్ అడిగినందుకు.. వేలు కొరికేశాడు

సారాంశం

రోడ్డు మీద సైడ్ ఇవ్వమని అడిగినందుకు.. వేలు కొరికేశాడు. ఎలా కొరికాడంటే.. వేలు తెగి కింద పడిపోయింది.

రోడ్డు మీద సైడ్ ఇవ్వమని అడిగినందుకు.. వేలు కొరికేశాడు. ఎలా కొరికాడంటే.. వేలు తెగి కింద పడిపోయింది. ఈ దారుణ సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మౌలాలి హనుమాన్ నగర్ కు చెందిన మహ్మద్ జాఫర్ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన అతను బైక్ పై  లాలా పేట వెళ్తున్నాడు. కాగా.. ఈ క్రమంలో మౌలాలి కమాన్ వద్ద ఎదురుగా ఇండికా కారు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు కొద్దిగా పక్కకు తీస్తే తాను వెళ్లిపోతానని జాఫర్ ఆ కారు డ్రైవర్ ని కోరాడు.

ఆ మాత్రం దానికే కోపంతో ఉగిపోయిన కారు డ్రైవర్.. జాపర్ ఉంగరపు వేలిని కొరికేశాడు. దీంతో అతని వేలు తెగి కిందపడిపోయింది. వెంటనే ఆ వేలితో సహా జాఫర్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాడు. సోమవారం ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మహ్మద్ ఆలిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu