గ్రేటర్ ప్రచారంలో ఉద్రిక్తత... బిజెపి, టీఆర్ఎస్ ల మధ్య ఘర్షణ

By Arun Kumar PFirst Published Nov 22, 2020, 11:24 AM IST
Highlights

రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్న ప్రచారంలో ఘర్షణలు మొదలయ్యాయి.  

ఇవాళ(ఆదివారం) మైలార్‌దేవ్‌ పల్లి డివిజన్ లో ప్రచారానికి వెళ్లిన బిజెపా కార్యకర్తలను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తమ పార్టీ ప్రచార వాహనాన్ని అడ్డుకుని అద్దాలు ధ్వంసం చేశారని బిజెపి శ్రేణులు ఆరోపిస్తుంటే... బిజెపి కావాలనే కవ్వింపుకు దిగుతోందని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. 

ఇరుపార్టీలు బాబుల్‌రెడ్డి నగర్‌లో ప్రచారం చేస్తుండగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.  

read more   జీహెచ్ఎంసీ ఎన్నికలు: వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలివే..!!

ఇక ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల గడువుతో పాటు పరిశీలన కూడా ముగిసింది. వివిధ పార్టీలకు చెందిన మొత్తం 1,893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో 68 నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో బీజేపీ 539, టీఆర్ఎస్ 527, కాంగ్రెస్‌ 348, టీడీపీ 202, ఎంఐఎం 72, సీపీఐ 22, సీపీఎం 19, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 143, స్వతంత్ర అభ్యర్థులు 613 నామినేషన్లు సవ్యంగా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడువుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది.  
 

  

 

click me!