తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 873 కేసులు, రెండున్నల లక్షలు దాటిన రికవరీలు

Arun Kumar P   | Asianet News
Published : Nov 22, 2020, 09:45 AM ISTUpdated : Nov 22, 2020, 09:59 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 873 కేసులు, రెండున్నల లక్షలు దాటిన రికవరీలు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గత 24గంటల్లో (శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 41,646మందికి టెస్టులు చేయగా కేవలం 873మందికి మాత్రమే పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 51,34,335కి చేరితే కేసుల సంఖ్య 2,63,526కు చేరాయి. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1296 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,50,453కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,643కు తగ్గాయి.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1430కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 94.03శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 152కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 78, రంగారెడ్డి 71, భద్రాద్రి కొత్తగూడెం 58, కరీంనగర్ 44, ఖమ్మం 29, నిజామాబాద్ 13, సంగారెడ్డి 27, సిద్దిపేట 18, సూర్యాపేట 22, వరంగల్ అర్బన్ 56, పెద్దపల్లి 22, నల్గొండ 47, మంచిర్యాల 22, జగిత్యాల 36, యాదాద్రి భువనగిరి 14, జగిత్యాల 36 కేసులు నమోదయ్యాయి.  

పూర్తి వివరాలు:


 

PREV
click me!

Recommended Stories

IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?