ఛీ ఛీ.. వీడు తండ్రేనా.. కన్నకొడుకుపై లైంగిక వేధింపులు.. !!

Published : Jan 07, 2022, 11:24 AM ISTUpdated : Jan 07, 2022, 11:40 AM IST
ఛీ ఛీ.. వీడు తండ్రేనా.. కన్నకొడుకుపై లైంగిక వేధింపులు.. !!

సారాంశం

భరత్ రెడ్డి, వీణారెడ్డి దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో కుమారుడు కొన్ని రోజులు తండ్రి వద్ద, మరికొన్ని రోజులు తల్లి వద్ద ఉంటున్నాడు. కుమారుడు తన వద్ద ఉన్నప్పుడు తండ్రి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తల్లి ఫిర్యాదు చేసింది. వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా భర్త భరత్ రెడ్డిపై వీణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.    

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. Hyderabadలోని ఉప్పల్ లో ఈ కిరాతకమైన సంఘటన చోటు చేసుకుంది. కుమారుడి పట్ల తండ్రి అత్యంత నీచంగా, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. జుగుస్స కరమైన ఈ ఘటనను తల్లి వ్యతిరేకించింది. 

సొంత కుమారుడిని Fatherభరత్ రెడ్డి Sexual harassmentకు గురి చేస్తున్నాడు. ఇది తెలిసిన భరత్ రెడ్డి wife ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భరత్ రెడ్డితో వీణారెడ్డికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. భరత్ నుంచి తన కుమారుడిని రక్షించాలని వీణారెడ్డి పోలీసులను కోరింది.

భరత్ రెడ్డి, వీణారెడ్డి దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో కుమారుడు కొన్ని రోజులు తండ్రి వద్ద, మరికొన్ని రోజులు తల్లి వద్ద ఉంటున్నాడు. కుమారుడు తన వద్ద ఉన్నప్పుడు తండ్రి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తల్లి ఫిర్యాదు చేసింది. వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా భర్త భరత్ రెడ్డిపై వీణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉండగా, గురువారం తాడేపల్లిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి liquor మత్తులో minor అయిన కన్న కూతురిపై రెండోసారి rapeకి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం uttarpradesh నుంచి 12 ఏళ్ళక్రితం ఓ కుటుంబం తాడేపల్లికి వలస వచ్చి మహానాడు లోని ఓ కాలనీ లో ఉంటుంది. భర్త సీలింగ్ పనులు చేస్తుండగా... భార్య పిల్లలను చూసుకుంటూ ఇంటివద్దే ఉంటుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.

రెండో కుమార్తె వయసు పదకొండేళ్లు,  దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.  తెల్లవారుజామున తండ్రి కూతురి మీద అత్యాచారానికి పాల్పడగా…  పెద్దగా కేకలు వేయడంతో నిద్రపోతున్న తల్లి లేచింది.  అక్కడి దృశ్యం చూసి పెద్దగా అరవడంతో భర్త పారిపోయాడు. మనస్థాపంతో బాలిక తల్లి ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతుండగా పెద్దకొడుకు అడ్డుకున్నాడు.  

ఆ తర్వాత స్థానికుల సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భర్త ఇలా అఘాయిత్యానికి తెగడబడడం ఇది మొదటి సారి కాదని..  ఏడాది క్రితం తన భర్త కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని  బయటికి చెబితే అందరిని చంపుతానని బెదిరించాడని ఆమె వాపోయింది. చేసిన తప్పు బంధువులకు తెలిసి నిలదీయడంతో క్షమాపణ కోరు తప్పించుకున్నాడని.. రెండోసారి మళ్లీ తప్పు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.  బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కాగా,  ఓ చర్చి ఫాదర్.. 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరేళ్ల క్రితం కేసు నమోదు కాగా.. తాజాగా డిసెంబర్ 30న POCSO ప్రత్యేక కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. 2015 ఆగస్టులో ఓ చర్చిలో క్యాథలిక్ మతగురువుగా ఉన్న ఫాదర్ జాన్సన్ లారెన్స్‌‌‌.. బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసలు విచారణ చేపట్టారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఫాదర్ జాన్సన్ లారెన్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితులు జైలులో ఉన్నాడు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu